తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Breakfast: బ్రేక్ ఫాస్ట్‌కి ఇలా రెండు ఎగ్ బర్గర్లు తినేయండి చాలు, రోజంతా శక్తి అందుతుంది

Egg Breakfast: బ్రేక్ ఫాస్ట్‌కి ఇలా రెండు ఎగ్ బర్గర్లు తినేయండి చాలు, రోజంతా శక్తి అందుతుంది

Haritha Chappa HT Telugu

28 March 2024, 6:00 IST

    • Egg Breakfast: బర్గర్ అంటే జంక్ ఫుడ్ కదా... తినమని చెబుతున్నారేంటి అనుకుంటున్నారా. ఇది హెల్తీ ఎగ్ బర్గర్. ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.
ఎగ్ బర్గర్ రెసిపీ
ఎగ్ బర్గర్ రెసిపీ

ఎగ్ బర్గర్ రెసిపీ

Egg Breakfast: బర్గర్ అనగానే జంక్ ఫుడ్ గుర్తుకొస్తుంది. బయట షాపుల్లో దొరికే బర్గర్ల గురించి మేము మాట్లాడటం లేదు. మీరు ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఎగ్ బర్గర్లను తయారు చేసుకొని తింటే బ్రేక్ ఫాస్ట్‌కు అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ప్రోటీన్ నిండిన ఈ ఎగ్ బర్గర్లు తింటే రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. బ్రెడ్ లేకుండా ఎగ్స్ తోనే బర్గర్ ను తయారు చేసి తినాలి. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

Worst Egg Combination : గుడ్లతో కలిపి తినకూడని ఆహారాలు.. సైడ్‌కి ఆమ్లెట్ కూడా వద్దండి

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

హెల్దీ ఎగ్ బర్గర్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉడకబెట్టిన గుడ్లు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

ఎండుమిర్చి - ఒకటి

టమోటో - ఒకటి

నువ్వులు - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

చీజ్ తరుగు - రెండు స్పూన్లు

నీరు - తగినంత

హెల్దీ ఎగ్ బర్గర్ రెసిపీ

1. కోడిగుడ్లను ఉడకబెట్టి పైన పొట్టు తీసేయాలి.

2. వాటిని రెండు సమాన భాగాలుగా నిలువుగా కత్తిరించి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు రెండుగా కోసిన గుడ్డును తీసుకొని వాటి మధ్యలో టమోటో సన్నగా గుండ్రంగా తరిగిన టమాటో ముక్కను పెట్టాలి.

4. రుచికి సరిపడా ఉప్పు చల్లాలి. ఎండుమిర్చిని రోట్లో వేసి దంచి లేదా చిన్న మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని కూడా చల్లుకోవాలి.

6. అలాగే మిరియాల పొడిని కూడా చల్లి పైన చీజ్ ను చల్లుకోవాలి.

7. దానిపైన గుడ్డు అర భాగాన్ని బర్గర్‌లా పెట్టాలి. దాన్ని ఇప్పుడు చూస్తే మీకు ఎగ్ బర్గర్ లాగే అనిపిస్తుంది.

8. ఈ బర్గర్ పై నువ్వుల గింజలు చల్లుకొని పెనం మీద కాసేపు వేడి చేసుకోండి. దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

9. ఇలాంటివి రెండు ఎగ్ బర్గర్లు చేసుకుంటే చాలు.

10. మీ బ్రేక్ ఫాస్ట్ పూర్తయిపోతుంది. ఆకలి కూడా వేయదు. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పాలి.

బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్లు తినడం వల్ల ఆ రోజంతా మీరు శక్తివంతంగా పనిచేయగలుగుతారు. ఉత్సాహంగా ఉంటారు. నీరసం కూడా రాదు. అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ నిండిన ఆహారాలను తినమని పోషకాహార నిపుణులు చెబుతారు. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఆహారం తింటే ఆ రోజంతా శరీరం అలసట లేకుండా పనిచేస్తుంది. గుడ్డులో మరి శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, విటమిన్ ఈ, పొటాషియం అధికంగా ఉంటాయి. అలాగే కొన్ని క్యాలరీలు కూడా అందుతాయి.

మనిషి ఆరోగ్యానికి కండర నిర్మాణానికి గుడ్డు చాలా అవసరం. ఇలా హెల్తీ ఎగ్ బర్గర్ చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ చాలా సులువుగా అయిపోతుంది. దీన్ని తినడానికి పెద్ద సమయం కూడా పట్టదు. ఈ రెండు ఎగ్ బర్గర్లు తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహారయాల్ని తినాలనిపించదు. తద్వారా బరువు కూడా తగ్గచ్చు. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా ఈ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇది తిని చూడండి... మీకే చాలా నచ్చుతుంది. దీన్ని చేయడానికి పెద్దగా సమయం పట్టదు. కాబట్టి పావుగంటలో చేసుకుని తిని ఆఫీసుకు బయలుదేరవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం