Corn Rice Recipe : లంచ్‌కి కార్న్పులావ్.. వెజ్, నాన్‌వెజ్‌కి పరెఫెక్ట్ కాంబినేేషన్
24 January 2023, 12:57 IST
- Corn Rice Recipe : మీ మధ్యాహ్నం భోజనాన్ని రుచిగా చేసుకోవాలన్నా.. లేదంటే హౌస్ పార్టీ చేసుకోవాలన్నా.. మీరు కార్న్ రైస్ ట్రై చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చిన రైతా, వెజ్, నాన్ వెజ్ కర్రీలతో లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ రైస్
Corn Rice Recipe : మొక్కజొన్నతో తయారు చేసుకునే రైస్ చాలా సులభంగా చేసుకోగలిగే టేస్టీ వంటకం. బేబీకార్న్, మొక్కజొన్న మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మీరు దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బాస్మతి బియ్యం - 1 కప్పు
* నీరు - 2 కప్పులు
* ఏలకులు - 2
* బిర్యానీ ఆకు - 1
* మిరియాలు - 4
* నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
* నూనె - 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ - 1
* అల్లం పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్
* స్వీట్ కార్న్ - 1 కప్పు (ఉడకబెట్టినవి)
* బేబీ కార్న్ - 6-7 ముక్కలు
* ధనియా పొడి - 1/4 టేబుల్ స్పూన్
* జీలకర్ర పొడి - 1/4 టేబుల్ స్పూన్
* పసుపు పొడి - 1/2 టేబుల్ స్పూన్
* కారం - 1 టేబుల్ స్పూన్
* గరం మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
* టొమాటో ప్యూరీ - 1/2 కప్పు
* కొత్తిమీర - కొంచెం తరిగినది
* ఉప్పు - రుచికి తగినంత
* తాజా క్రీమ్ - 3-4 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న రైస్ తయారీ విధానం
మొక్కజొన్న రైస్ రెసిపీని తయారు చేయడానికి.. రైస్ కుక్కర్ లేదా సాస్ పాన్ తీసుకోండి. దానిలో కడిగిన బియ్యం, నీరు వేయండి. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బే ఆకు, మిరియాలు, ఉప్పు వేసి బియ్యం పూర్తిగా ఉడికినంత వరకు మరిగించాలి. తర్వాత ఏదైనా అదనపు నీరు ఉంటే దానిని తీసేసి.. అన్నం పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో నూనెలో జీలకర్ర వేసి, ఉల్లిపాయ వేయండి. వాటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు దానిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి.. ఉడికించిన మొక్కజొన్న, బేబీ కార్న్, ఉప్పు వేసి బాగా కలపండి. దానిని 2 నిమిషాలు ఉడికించండి. దానిలో పొడి మసాలాలు వేసి, జీలకర్ర, ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా వేసి.. బాగా కలపండి. మరో రెండు 2 నిమిషాలు ఉడికించండి. దానిలో టొమాటో ప్యూరీ వేసి.. మరో 2-3 నిమిషాలు ఉడికించండి. క్రీమ్ వేసి స్టవ్ ఆపివేయండి.
ఇప్పుడు బేకింగ్ డిష్ తీసుకోండి. ముందు కూరగాయలు, తరువాత బియ్యం వేసి.. పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తాజా కొత్తిమీర వేయండి. దీన్ని అల్యూమినియం ఫాయిల్‌తో కప్పి.. 180 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో సుమారు 10 నిమిషాలు ఉంచండి. పూర్తయిన తర్వాత, దానిని బయటకు తీయండి. అంతే వేడి వేడి కార్న్ రైస్ రెడీ. దీనిని మీరు పనీర్ బటర్ మసాలా, బటర్ చికెన్, రైతాతో తయారు చేసుకోవచ్చు.