ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు.. ఈ పండ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
05 June 2022, 16:17 IST
- పండ్లు తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లును తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. ఇక వర్షాకాలం ప్రారంభంలో విరివిగా దొరికే నేరేడు పండ్లలో శరీరానికి కావాల్సి అనేక పోషకాలు ఉంటాయి.
నేరేడు ;పండు
పండ్లు శరీర పెరుగుదలకు, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. పండ్లు తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లును తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. ఇక వర్షాకాలం ప్రారంభంలో విరివిగా దొరికే నేరేడు పండ్లలో శరీరానికి కావాల్సి అనేక పోషకాలు ఉంటాయి. నేరేడు పండు పోషకాల గనిగా.. అనారోగ్యాల నివారణిగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని రోగాలనూ నియంత్రించే శక్తి కూడా నేరేడు ఉంటుంది. నేరేడు పండ్ల వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరం: వీటిలో ఊదా రంగుతో పాటు, గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు గింజలను తినడం వల్ల చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటి గింజలను పొడిగా చేసి, ఒక టీస్పూన్‌ను గ్లాసు నీటిలో కలపి తాగాలి.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది: ఈ పర్పుల్ పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. వీటితో అదనంగా బెల్లం తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
బరువు నియంత్రణలో ఉంచుతుంది: బరువు పెరగడాన్ని నియంత్రించడానికి నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువ. అందువల్ల, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
క్యాన్సర్ నిరోధిస్తుంది: క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండేందుకు కూడా నేరేడు ఉపయోగపడుతుంది. పరిశోధనల ప్రకారం, నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. వీటిలోని పదార్థాలు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
హెల్తీ హార్ట్: పర్పుల్ ఫ్రూట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.