తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Valentine's Day। మీ ప్రేమను మాటల్లో చెప్పలేకపోతే.. ఈ ప్రేమ సందేశాలు పంపండి!

Happy Valentine's Day। మీ ప్రేమను మాటల్లో చెప్పలేకపోతే.. ఈ ప్రేమ సందేశాలు పంపండి!

HT Telugu Desk HT Telugu

14 February 2023, 7:30 IST

google News
    • Happy Valentine's Day: మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? మీ ప్రేమను మాటల్లో చెప్పలేకపోతే, మేము మీ కోసం ఇక్కడ కొన్ని ప్రేమ సందేశాలు రూపొందించాము. మీ ప్రేమను తెలియజేయండి మరి. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
Happy Valentine's Day
Happy Valentine's Day

Happy Valentine's Day

ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రేమికుల రోజు వచ్చేసింది. ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు తమ ప్రేమను వేడుకగా జరుపుకునే రోజు ఇదే. సింగిల్స్ తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎవరికైనా, ఎవరి మీదనైనా క్రష్ ఉంటే, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పే ఒక గొప్ప సందర్భంగా ఈరోజు ఉంటుంది. ఈ ప్రేమికుల రోజున భార్యాభర్తలు కూడా మీ భాగస్వామి అంటే మీకు ఎంత ప్రేమో వ్యక్తం చేయవచ్చు, ఒక అందమైన ప్రేమ కానుకను అందించి వారిని ఆనందింపజేయవచ్చు.

నిజానికి నిజమైన ప్రేమకు ఒక్కరోజు కాదు కదా, ఒక జీవితం కూడా సరిపోదు. ఇలా ప్రేమికుల రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ప్రేమించవచ్చు.

మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే, మీ ప్రేమను మాటల్లో చెప్పలేకపోతుంటే, మేము మీకు ఇక్కడ ఒక దారిని చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రేమ సందేశాలు, Valentines Day Messages, Love Quotes, Love Poems రూపొందించాము. మీరు వీటిని WhatsApp, Facebook లేదా ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకోవచ్చు, మీ ప్రేమను వ్యక్తం చేయవచ్చు.

Happy Valentine's Day - ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

నిన్ను చూసిన క్షణం నుంచి నా జీవితం కొత్తగా ఉంది

నిరంతరం నీ ఆలోచనలతో సతమతమవుతోంది నా మది

జీవితాంతం నిన్నే ప్రేమించాలి, నీతోనే ఉండాలి అనిపిస్తోంది

నీ సమ్మతంతోనే నాకు నమ్మకం కలుగుతుంది

Happy Valentine's Day

నీ కోసమే నా అణ్వేషణ,

నీ కోసమే నా నిరీక్షణ

నిన్ని కలిసే క్షణం కోసం..

ఎన్ని వేల సార్లు మరణించడానికైనా సిద్ధమే

Happy Valentine's Day

ఊహ తెలిసిన దగ్గర్నించీ ఊహించలేదు..

నేను ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తున్నాననీ!

Happy Valentine's Day

నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన

నిద్ర లేచాక నా మొదటి ఆలోచన నువ్వే!

Happy Valentines Day

నువ్వు నాతో ప్రతీరోజు కలిసి ఉండకపోవచ్చు..

కానీ ప్రతీ క్షణం నా గుండెల్లోనే ఉంటావు!

.. ప్రేమ అనేది ఈ సృష్టిలోనే ఎంతో అమూల్యమైనది. అది దొరికిన వారు ఎంతో అదృష్టవంతులు. మీ ప్రేమబంధం చిరకాల బంధంగా మారి కడదాకా తోడుండాలని కోరుకుందాం.

తదుపరి వ్యాసం