తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Wishes Telugu : ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. ఆనందంగా గడపండి

Ugadi Wishes Telugu : ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. ఆనందంగా గడపండి

Anand Sai HT Telugu

09 April 2024, 5:30 IST

    • Ugadi Wishes In Telugu : ఉగాది పండుక వచ్చేసింది. మీ ప్రియమైనవారికి ఉగాది శుభాకాంక్షలు పంపండి. మీ కోసం కొన్ని సందేశాలు ఇక్కడ ఉన్నాయి.
ఉగాది శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు

హిందూ పంచాగం ప్రకారం 2024లో ఏప్రిల్ 9 క్రోధి నామ సంవత్సరం. కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. కొత్తదనంతో ఉగాది రాబోతోంది. బాధ, దుఃఖం కలగలిసినదే జీవితం. ఉగాది పండుగ కూడా అదే విషయాన్ని చెబుతుంది. ఏ పండుగ వచ్చినా బంధువులు, స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అందరికీ శుభం, ఆరోగ్యం, సంపద, శాంతిని కలగాలని కోరుకుంటారు. ఉగాది శుభాకాంక్షలును మీ ప్రియమైనవారికి తెలియజేయండి.

కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం.., ఈ సంవత్సరం అందరి జీవితాల్లో కొత్తదనాన్ని నింపాలి. ఈ ఉగాది నుంచి జీవితంలో చేదు తగ్గి తీపి పెరగాలి. క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు

సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉండనివ్వండి..

అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

కొత్తదనంతో ఉగాది వచ్చేసింది.. ఈ ఉగాది ప్రతి ఒక్కరికీ కొత్త ఆనందాన్ని, జీవితంలో శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.. Happy Ugadi

జీవితం వేప, బెల్లం లాంటిది..

సుఖం ఉంది, దుఃఖం ఉంది..

ఆనందంగా ఉన్నప్పుడు సంబరపడిపోవద్దు.. దుఃఖంలో ఉన్నప్పుడు కుంగిపోవద్దు.. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరనివ్వండి.. మీరు అనుకున్నది సాధించాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో వేపలాంటి చేదు పోవాలని.., బెల్లంలాంటి తీపి పెరగాలని కోరుకుంటున్నాను.. Happy Ugadi 2024

కొత్త సంవత్సరం వచ్చేసింది.. ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో పురోగతిని తీసుకురావాలని, మీ ఆర్థిక స్థితి బాగుండాలని, భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు

మీ జీవితంలో వేప చేదు కంటే బెల్లంలోని తీపి ఎక్కువగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. Happy ugadi

మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, సామరస్యం ప్రవహించాలి.. ఉగాది శుభాకాంక్షలు

మనమందరం మన జీవితాలకు బలమైన పునాదిని కలిగి ఉండాలి.. ఈ కొత్త సంవత్సరం నుంచే అది మెుదలు కావాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు

మీ అన్ని కొత్త కలలు నిజమవుతాయి.. క్రోధి నామ సంవత్సరం మీకు విజయాలను ఇవ్వాలి.. Happy Ugadi 2024

క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. కొత్త సంవత్సరంలో మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను.. సంవత్సరం మొత్తం ఆనందంతో నిండి ఉండాలి.. ఉగాది పండుగ శుభాకాంక్షలు

మీ చుట్టూ ఉన్న చీకటిని వెలుతురుగా మార్చండి.. ఈ ఉగాది మీ కుటుంబానికి ఆనందం ఇవ్వాలి, శాంతి, ప్రశాంతతను కలిగిస్తుందని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

మీ వృత్తి జీవితంలో అభివృద్ధి చెందాలి.. ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మీ వంతు కృషి చేయండి.. దేవుడు మీకు సమృద్ధిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.. Happy Ugadi

కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం.. అదే ఉగాది పచ్చడి చెప్పే అసలు నిజం.. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు 2024

ఈ క్రోధి నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు Happy Ugadi 2024

అన్ని రాశుల వారికి ఉగాది రాశి ఫలాల కోసం ఈ పేజీ చూడండి.

తదుపరి వ్యాసం