Auspicious raja yogam: 3 రాజయోగాలతో ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి మూడింతల లాభాలు-three auspicious raja yogam begins in hindu new year these zodaic signs get full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Auspicious Raja Yogam: 3 రాజయోగాలతో ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి మూడింతల లాభాలు

Auspicious raja yogam: 3 రాజయోగాలతో ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి మూడింతల లాభాలు

Gunti Soundarya HT Telugu
Mar 19, 2024 10:46 AM IST

Auspicious raja yogam: త్వరలో ప్రారంభం కాబోతున్న హిందూ కొత్త సంవత్సరం మూడు రాజయోగాలు తీసుకొస్తుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఏడాది పొడవునా లాభాలు కలగబోతున్నాయి.

కొత్త సంవత్సరం మూడు శుభ యోగాలు
కొత్త సంవత్సరం మూడు శుభ యోగాలు (freepik)

Auspicious raja yogam: ఆంగ్ల సంవత్సరం ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి నూతన సంవత్సరం ప్రారంభమైంది. కానీ హిందూ నూతన సంవత్సరం మాత్రం వైదిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 9 నుండి ప్రారంభం అవుతుంది.

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఆరోజు నుంచే కొత్త ఏడాది మొదలైనట్టు భావిస్తారు. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి ఉగాదితో క్రోధి నామ సంవత్సరం మొదలుకాబోతుంది. ఈ ఏడాది వచ్చే హిందూ నూతన సంవత్సరం మూడు శుభ యోగాలతో ప్రారంభం కాబోతుంది. సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ మూడు యోగాలు కలిసి వస్తున్నాయి. ఆరోజు అమృత యోగం, సర్వార్ధ సిద్ధియోగం, శశ రాజయోగం ఏర్పడుతున్నాయి.

కొత్త సంవత్సరం మీద అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు, శని ప్రభావం ఏడాది పొడవునా కనిపిస్తుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అపారమైన విజయం సొంతం అవుతుంది. ఈ రాజయోగం పన్నెండు రాశులను ప్రభావితం చేసినప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం గొప్ప ఫలితాలు ఇవ్వబోతుంది.

ఏప్రిల్ 9న సర్వార్థ సిద్ధి యోగం, అమృత యోగంతో పాటు రేవతి, అశ్వినీ నక్షత్రాలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ రెండు యోగాలు ఏప్రిల్ 10 వరకు ఉంటాయి. ఆరోజు ఉదయం చంద్రుడు మీనరాశిలో ఉంటాడు. తర్వాత మేష రాశి ప్రవేశం చేస్తాడు. అటు కుంభ రాశిలో శని, అంగారకుడు కలిసి ఉండటం వల్ల శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇటువంటి అద్భుతమైన యోగాల ప్రభావంతో అదృష్టాన్ని పొందే మూడు రాశులు ఏవంటే..

వృషభ రాశి

క్రోధి నామ సంవత్సరం మూడు శుభయోగాలతో ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం కలుగుతుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభం ఇస్తాయి. అప్పులు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం పొందుతారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది అనువైన సమయం.

మిథున రాశి

మిథున రాశి వారికి కొత్త సంవత్సరం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. కెరీర్ లో అనేక కొత్త అవకాశాలు మీకోసం ఎదురు చూస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపారానికి కొత్త వనరులు ఏర్పడతాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంకితభావంతో నిజాయితీగా పని చేస్తారు. మీరు ప్రేమ వ్యక్తపరిచే విధానం పట్ల జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

కొత్త సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఉత్తమమైనదిగా ఉంటుంది. పనిలో మీ ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. సీనియర్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో లాభాలు పురోగతి ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా డబ్బు పొందుతారు. ఖర్చులు ఉన్నప్పటికీ డబ్బులు ఆదా చేయగలుగుతారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా, ధృడవిశ్వాసంతో ఉంటారు.