Ramadan 2024 Telugu Wishes: ఈద్ ముబారక్.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా అందంగా చెప్పండి
10 April 2024, 16:30 IST
- Ramadan 2024 Telugu Wishes: ముస్లిం సోదరులకు అతి పెద్ద పండుగ రంజాన్. దీన్ని ఈద్, ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. పండుగ నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.
రంజాన్ శుభాకాంక్షలు
Ramadan 2024 Telugu Wishes: ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్. రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చేసింది. చివరి రోజున ఈద్-ఉల్-ఫితర్ పండుగను నిర్వహించుకుంటారు. దీన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజు పవిత్ర ఖురాన్ ను చదువుతూ, ప్రార్థనలు చేస్తారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని సూచిస్తుంది. రంజాన్ మాసంలో చేసిన కఠిన ఉపవాస దీక్షలకు ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగింపు వచ్చేస్తుంది.
ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్, టర్కీ, ఈజిప్ట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఏప్రిల్ 10నే నిర్వహించుకుంటారు. మనదేశంలో మాత్రం ఏప్రిల్ 11 ఈద్-ఉల్-ఫితర్ పండుగ చేసుకుంటున్నారు. ఈద్ చంద్రుడు కనిపిస్తేనే ఈ పండుగను నిర్వహించుకుంటారు. మన దేశంలో ఏప్రిల్ 11న చంద్రుడు కనిపించే అవకాశం ఉంది.
ఈద్ శుభాకాంక్షలు
రంజాన్ శుభాకాంక్షలను ప్రతి ముస్లిం సోదరునికి అందంగా తెలియజేయండి. వారు ఆ పండుగను మరింత ఆనందంగా నిర్వహించుకునేలా చేయండి. ఇక్కడ మేము కొన్ని రంజాన్ శుభాకాంక్షలు ఇచ్చాము .
1. పవిత్ర రంజాన్ మాసం ముగిసిపోతోంది.
అల్లా మిమ్మల్ని ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తారు.
మీ ఇంటి సభ్యులను, మిమ్మల్ని శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తారు.
ప్రియమైన మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు.
2. అల్లా ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికీ మిమ్మల్ని కాపాడాలని,
మీలో ఆశా, విశ్వాసం పెరిగేలా చేయాలని కోరుకుంటున్నాము.
ఈద్ ముబారక్
3. మీకు మీ కుటుంబ సభ్యులకు
శాంతి, శ్రేయస్సు, సంతోషాలు కలగాలని
కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు
4. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ
కలిసి ఇలా చెప్పాయి...
‘రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే
మీ కోరికలు నెరవేరుతాయి’ అని.
వారు చెప్పినట్టే మీ ప్రార్ధనలు నెరవేరాలని కోరుకుంటూ
హ్యాపీ రంజాన్
5. అల్లా మీ అందరినీ చల్లగా చూడాలని
సుఖశాంతులు మీ ఇంట నిత్యం ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు
6. క్రమశిక్షణ, దాతృత్వం,
ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం.
మీకూ మీ కుటుంబ సభ్యులకు
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు.
7. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని
అధిగమించే శక్తిని
అల్లా మీకు ప్రసాదించాలని కోరుకుంటూ
ఈద్ ముబారక్
8. దేవుడు సంతోషకరమైన జీవితాన్ని మీకు ఇచ్చాడు.
దాన్ని అలాగే సాగిపోనివ్వండి.
దుఃఖాన్ని దరిచేరనీయకండి.
అల్లా ఆశీర్వాదంతో మీకు జీవితంలో
అంతా మంచే జరగాలని కోరుకుంటూ...
ఈద్ ముబారక్
9. రంజాన్ పండుగ సందర్భంగా
మీ హృదయాన్ని ఆనందంతో
మీ ఇంటిని నవ్వులతో నింపండి.
ఈ సంతోషకరమైన పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
10. ప్రకాశించే నెలవంక
రంజాన్ ముగింపును సూచిస్తుంది.
మీ జీవితంలో ఇది ఆనందాన్ని నింపుతుంది.
మీకు మీ కుటుంబ సభ్యులకు
రంజాన్ శుభాకాంక్షలు.
11. ఈ పండుగ మీకు, మీ ప్రియమైన వారికి
చిరకాల జ్ఞాపకాలను నింపాలని కోరుకుంటూ
ఈద్ ముబారక్.
12. శుభ సందర్భంలో
అల్లా నుంచి వచ్చే దివ్యకాంతి
మీపై మీ కుటుంబంపై ప్రకాశించాలని కోరుకుంటున్నాం.
మిమ్మల్ని విజయం వైపు నడిపించాలని ఆశిస్తున్నాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు
13. మీకు ప్రేమ, శాంతి, ఆనందంతో నిండిన
ఈద్-ఉల్-ఫితర్ పండుగ శుభాకాంక్షలు.
14. రంజాన్ పండుగ సందర్భంగా
అల్లా దయ, ఆశీర్వాదాలు
మీతో ఉండాలని కోరుకుంటున్నాం
ఈద్ ముబారక్
15. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను
ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని, వివేకాన్ని
అల్లా మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈద్ ముబారక్
16. ఈ సంతోషకరమైన పండుగలు
మనమంతా ఒకచోట చేరుదాం. ప్రార్థిద్దాం.
పేదలకు సహాయం చేద్దాం.
మన జీవితాల్లో అల్లా చెప్పిన బోధనలను పాటిద్దాం.
ఈద్ ముబారక్
టాపిక్