తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Care Tips : జుట్టు పెరగడానికి కొన్ని సహజమైన మార్గాలు ఇవే.. పాటించండి..

Hair Care Tips : జుట్టు పెరగడానికి కొన్ని సహజమైన మార్గాలు ఇవే.. పాటించండి..

Anand Sai HT Telugu

14 June 2024, 10:30 IST

google News
    • Hair Care Tips In Telugu : జుట్టు పెరగాలని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొన్ని సహజమైన మార్గాలు పాటిస్తే సరిపోతుంది. దాంతో మీ జుట్టు ఆరోగ్యం బాగుపడుతుంది.
జుట్టు పెరుగుదలకు చిట్కాలు
జుట్టు పెరుగుదలకు చిట్కాలు (Unsplash)

జుట్టు పెరుగుదలకు చిట్కాలు

ఆరోగ్యకరమైన జుట్టు ప్రతి వ్యక్తి కల. కానీ జీవన పరిస్థితులు, మానసిక ఒత్తిడి వివిధ కారణాల వల్ల సహజ సౌందర్యం, జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితులు అధిక జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఒక వ్యక్తి తలలో రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ జుట్టు రాలడం అసాధారణంగా ఉంటే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అయితే మీరు మీ జుట్టును సమృద్ధిగా పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి అనేక సహజమైన మార్గాలు ఉన్నాయి.

హెయిర్ ఆయిల్స్

హెయిర్ ఆయిల్స్, మాస్క్‌లతో స్కాల్ప్‌ను మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మసాజ్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే, చేతితో కాకుండా వేళ్లతో మసాజ్ చేయాలి. ఈ మసాజ్‌లో రోజుకు 4 నిమిషాలు వెచ్చిస్తే మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. జుట్టుకు నూనెను క్రమం తప్పకుండా వాడాలి.

కలబంద

కలబంద చాలా ఇళ్లలో కనిపించే ఒక మొక్క. అలోవెరా జెల్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ జుట్టుకు బలం, అందం వస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది హెయిర్ షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోయి ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా తలకు పట్టించిన కొబ్బరి నూనె స్కాల్ప్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరుస్తుంది. స్కాల్ప్, సంబంధిత హెయిర్ ఫోలికల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నూనెను స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. పొడి చర్మం ఉన్న వారికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లలో ప్రోటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో పాటు ఈ రకమైన ఒమేగా సప్లిమెంట్ తీసుకోవడం వల్ల జుట్టు సాంద్రత, మందం, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. కానీ దాని వాసన చాలా మందికి భరించలేనిదిగా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు, జుట్టుకు అప్లై చేసి కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపూతో కడగాలి.

రోజ్మేరీ ఆయిల్

రోజ్మేరీ ఆయిల్ కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఆర్గాన్ ఆయిల్ లేదా జొజోబా ఆయిల్‌తో రోజ్‌మేరీ ఆయిల్ మిక్స్ చేసి స్కాల్ప్‌కు అప్లై చేయండి. తర్వాత బాగా మసాజ్ చేసి కడిగేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తే జుట్టు పెరుగుతుంది.

జుట్టుకు సప్లిమెంట్

వివిస్కల్ అనేది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సహజమైన జుట్టు పెరుగుదల సప్లిమెంట్. ఖనిజాలు అధికంగా ఉండే ఆహారంలో వివిస్కల్ ఉంటుంది. ఆర్గానిక్ సిలికా, విటమిన్ సి, బయోటిన్, జింక్ అన్నీ జుట్టు కణాలను పునరుత్పత్తి చేయడానికి, ఇప్పటికే ఉన్న కణాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. దీనిని ఆరు నెలలపాటు తీసుకోవాలి. అయితే నిపుణులను సంప్రదించి వాడాలి.

తదుపరి వ్యాసం