తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gut Health In Monsoon । వర్షాకాలంలో మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలు!

Gut Health in Monsoon । వర్షాకాలంలో మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలు!

HT Telugu Desk HT Telugu

18 July 2023, 9:53 IST

google News
    • Gut Health in Monsoon: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని బలపరిచే,  మీ పేగులను ఆరోగ్యంగా ఉంచే, మీ శ్రేయస్సును పెంచడంలో సహాయపడే కొన్ని చిట్కాలు చూడండి.
Gut Health in Monsoon
Gut Health in Monsoon (istock)

Gut Health in Monsoon

Gut Health in Monsoon: వర్షాకాలంలో మీ పేగు ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సీజన్‌లో నీరు కలుషితం అవుతుంది, పరిసరాలు కలుషితం అవుతాయి. రోడ్డు పక్కన అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసే ఆహార పదార్థాలు తినడం, పానీయాలు తాగటం వలన అవి మీ కడుపు ఆరోగ్యాన్ని చెడగొడతాయి, పేగులలో బ్యాక్టీరియా అసమతుల్యత జరుగుతుంది. హానికర సూక్ష్మజీవుల పెరుగుదల కారణంగా పేగులో ఇన్ఫెక్షన్ కలుగుతుంది. దీంతో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కలుషితమైన నీరు తాగటం ద్వారా అనేక కడుపు ఇన్‌ఫెక్షన్‌లు, కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.

ఇవి మాత్రమే కాకుండా ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా సర్వసాధారణం. అందువల్ల వర్షాకాలంలో మీరు జబ్బు పడకుండా ఉండాలన్నా లేదా అనారోగ్యాల నుంచి వేగంగా కోలుకోవాలన్నా, మీకు బలమైన రోగనిరోధక శక్తి అవసరం. మీ శరీరంలోని బలమైన రోగనిరోధక శక్తి చాలా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోండి. ప్రతీ విషయంలో పరిశుభ్రత పాటించండి. నీటిని మరిగించడం, కూరగాయలను శుభ్రంగా కడుక్కోవడం వంటి ఇతర జాగ్రత్తలు తీసుకోండి, ఏదైనా తినేటపుడు మీ చేతులను శుభ్రపరచుకోవడం, వర్షాకాలంకు అనుకూలంగా ఉండేలా మీ ఆహారాన్ని మార్చుకోవడం చేయాలి.

క్లినికల్ న్యూట్రిషనిస్ట్, గట్ హెల్త్ ఎక్స్‌పర్ట్ అయిన అవంతి దేశ్‌పాండే, HT డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని బలపరిచే, మీ పేగులను ఆరోగ్యంగా ఉంచే, మీ శ్రేయస్సును పెంచడంలో సహాయపడే కొన్ని చిట్కాలను తెలిపారు.

వండిన ఆహారాన్ని తినండి

మాన్సూన్‌లో పచ్చి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి జీర్ణశయ ఇన్‌ఫెక్షన్లను పెంచే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో హానికర సూక్ష్మజీవుల వృద్ధి పెరుగుతుంది కాబట్టి పచ్చిగా తినడం కంటే బాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బాగా వండితే అందులోని సూక్ష్మజీవులు నశిస్తాయి. స్టైర్ ఫ్రై వెజిటేబుల్స్, సూప్‌లు, ఉడికించిన కూరలు , ఆవిరిలో వండిన కూరగాయలను తీసుకోండి, మరోవైపు పచ్చి ఆహారాలు కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, ఇతర అనారోగ్యాలను కలిగిస్తాయి. పచ్చి సలాడ్‌లను మితంగా తీసుకోండి. పండ్లనుతినడానికి ముందు బాగా కడగండి,యాపిల్, పియర్ వంటి పీచు పండ్లు వంటి గుజ్జు కలిగిన పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

హెర్బల్ టీలు తాగండి

తులసి, మిరియాలు, పసుపు, లెమన్ గ్రాస్, అల్లం మొదలైన మూలికలను ఉపయోగించి తయారు చేసే హెర్బల్ టీలను తాగండి, ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మీరు రుచిని ఆస్వాదించాలనుకుంటే టీలలో దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వంటి మసాలా దినుసులు జోడించండి, ఇవి రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.

ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి

వర్షాకాలం పేగులను బలహీనపరుస్తుంది కాబట్టి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా వాటి పనితీరు పెంచడం చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఇంగువ, నల్ల ఉప్పు, సౌర్‌క్రాట్ వేసి తీసుకోవడం, ఇతర పులియబెట్టిన కూరగాయలు తీసుకుంటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు తినే ప్రతి భోజనంలో కొంత ప్రోటీన్ మూలం ఉండేలా చూసుకోండి - రోగనిరోధక వ్యవస్థలో ప్రోటీన్లు ఒక భాగమైనందున రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పప్పులు, పెరుగు, గింజలు లేదా పరిమితంగా నాన్-వెజ్ ఆహారాలు తీసుకోండి. అల్పాహారంలో పెరుగు, గింజలు లేదా ఓట్స్‌ను పాలతో తినండి. మధ్యాహ్న భోజనంలో పప్పులు, చిక్కుళ్ళు , తృణధాన్యాలు చేర్చవచ్చు. రాత్రి భోజనంలో ప్రోటీన్ మూలంగా ఉండే పెరుగు లేదా చికెన్ వంటి నాన్-వెజ్ ఆహారాలు తీసుకోవచ్చు.

ఒమేగా 3 రిచ్ ఫుడ్స్

ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, బాదం పప్పులు, వాల్‌నట్‌లు, కొవ్వు చేపలు మొదలైనవి ఒమేగా 3 పోషకానికి మూలాలు. వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి.

తదుపరి వ్యాసం