తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Guru Purnima 2024: గురుపూర్ణిమ శుభాకాంక్షలు ఇలా తెలపండి.. మెసేజీలు, ఫొటోలు మీకోసం

Guru Purnima 2024: గురుపూర్ణిమ శుభాకాంక్షలు ఇలా తెలపండి.. మెసేజీలు, ఫొటోలు మీకోసం

20 July 2024, 16:00 IST

google News
  • Guru Purnima 2024: గురు పూర్ణిమ సందర్భంగా మీకు మార్గనిర్దేశకం చేసిన వ్యక్తులకు, గురువులకు శుభాకాంక్షలు తెలపండి. ఈ ఫొటోలు, విషెస్ చూడండి. 

గురు పూర్ణిమ 2024
గురు పూర్ణిమ 2024

గురు పూర్ణిమ 2024

సనాతన ధర్మంలో, గురువులను దేవుడితో సమానంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ ఏడాది గురుపౌర్ణమి జూలై 21న వస్తుంది. ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వేదాలను రచించిన వేద వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ సందర్భంగా, మీరు కొన్ని ప్రత్యేక సందేశాల ద్వారా గురు పూర్ణిమ శుభాకాంక్షలను పంపడం ద్వారా గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. గురు పూర్ణిమ స్పెషల్ విషెస్ ఇక్కడ చూడండి ..

ఈ రోజున మీకు చదువు చెప్పిన గురువులకు, మీకు మార్గనిర్దేశకం చేసిన వ్యక్తులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపండి. మీ జీవితంలో వాళ్లకున్న ప్రాముఖ్యతను తెలియజేయండి. 

గురుపూర్ణిమ శుభాకాంక్షల మెసేజీలు, ఫొటోలు:

సాధారణ ఉపాధ్యాయుడు విషయాన్ని చెబుతాడు. సద్గురువు విపులంగా వివరిస్తాడు. గొప్ప గురువు స్ఫూర్తినిస్తాడు.

గురుపూర్ణిమ
  1. ప్రియమైన ఉపాధ్యాయుడా, మీరు లేకపోతే నేను జీవితంలో ఇక్కడిదాకా చేరుకోవడం సాధ్యమయ్యేది కాదు. నేను తెల్సుకోవాల్సిన ప్రతి విషయం నాకు నేర్పినందుకు మీకు కృతజ్ఞతలు.

2. గురువు లేని జ్ఞానం లేదు, జ్ఞానం లేని ఆత్మ లేదు,

ధ్యానం, జ్ఞానం, సహనం, కర్మ అన్నీ గురువే ప్రసాదించినవి.

గురు పూర్ణిమ శుభాకాంక్షలు

3. జ్ఞాన భాండాగారాన్ని మనకు ప్రసాదించి, భవిష్యత్తు కోసం సిద్ధం చేసిన గురువులకు మేము కృతజ్ఞులము. గురు పూర్ణిమ శుభాకాంక్షలు

గురుపూర్ణిమ జులై 21 న జరుపుకుంటున్నాం.

4. అజ్ఞానాన్ని తొలగించడంలో గురువు మహిమ అద్వితీయం

జ్ఞానజ్యోతి వెలిగించే గురువులకు హ్యాపీ గురు పూర్ణిమ 2024

5. నా తరఫున, నా కుటుంబం తరపున మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు గొప్పగా గడవాలని కోరుకుంటున్నాను.

6. గురువు ఏం చెబుతున్నాడనే దాని కన్నా, గురువు ఎలాంటి వాడనేది చాలా ముఖ్యం.

గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
గురు పూర్ణిమ 2024

7. తల్లిదండ్రులు జన్మనిస్తారు. ఆ జన్మను జీవించే కళ నేర్పేది మాత్రం గురువే. తెలివిని, సంస్కారాన్ని నేర్పుతూ బోధించే గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు

8. ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులు నేర్పిన బోధనలను గుర్తు చేసుకుందాం. వాటికి కట్టుబడి జీవిద్దాం.

అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు

9. మనం చేసే తప్పులే మనకు బోదిస్తాయి. కానీ తప్పులు చేయకుండా మనల్ని సన్మార్గంలో నడిపించేది గురువులు. మన జీవితంలో మనల్ని మార్గనిర్దేశకం చేసిన ప్రతి ఒక్కరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

తదుపరి వ్యాసం