Guru purnima 2024: గురు పూర్ణిమ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి-guru purnima date and shubha samayam significance and puja vidhanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Guru Purnima 2024: గురు పూర్ణిమ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

Guru purnima 2024: గురు పూర్ణిమ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Jul 16, 2024 02:05 PM IST

Guru purnima 2024: హిందూ మతంలో గురు పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. గురు పూర్ణిమ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత, పూజా విధానం, స్నానం, దానం చేసే శుభ సమయం తెలుసుకోండి.

గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థులు గురువును సత్కరిస్తున్న విద్యార్థులు
గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థులు గురువును సత్కరిస్తున్న విద్యార్థులు (Ashok Munjani)

Guru purnima 2024: ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని నమ్ముతారు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు. దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది. పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ హరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు.

గురు పూర్ణిమ ఎప్పుడు?

ఆషాఢ మాసం పౌర్ణమి తేదీ 20 జూలై 2024న సాయంత్రం 05:59 గంటలకు ప్రారంభమై 21 జూలై 2024న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఆదివారం జూలై 21, 2024 నాడు ఉదయ తిథిలో జరుపుకుంటారు.

గురు పూర్ణిమ నాడు చేయవలసిన దానాలు

గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు. శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు. అలాగే నుదుటి మీడ కుంకుమ తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి. లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

స్నానం చేసేందుకు అనుకూలమైన సమయం

గురు పూర్ణిమ రోజున స్నానం, దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం 09:01 AM నుండి 10:44 AM వరకు ఉంటుంది. రెండవ ముహూర్తం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. దీని తర్వాత శుభ సమయం మధ్యాహ్నం 2:09 నుండి 03:52 వరకు ఉంటుంది.

గురు పూర్ణిమ ప్రాముఖ్యత

భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు వ్యక్తికి సరైన మార్గాన్ని చూపుతాడు. ఒక వ్యక్తి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుంది. గురువు అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు. గురు పూర్ణిమ రోజే శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నాడని చెబుతారు. బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా ఇదే రోజున తన అనుచరులకు మొదటి ఉపన్యాసం ఇచ్చాడని చెబుతారు.

గురు పూర్ణిమ పూజా విధానం

ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి. పవిత్ర పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించండి. విష్ణువుకు ఆహారం సమర్పించండి. గురు పూర్ణిమ రోజున మహర్షి వేదవ్యాసుడిని ఆరాధించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున మీ గురువులను ధ్యానించండి. పౌర్ణమి రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

 

 

Whats_app_banner