తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gun Powder: ఇడ్లీ, దోశెల్లోకి ఇలా గన్ పౌడర్ చేసి పెట్టుకోండి, రుచి అదిరిపోతుంది

Gun Powder: ఇడ్లీ, దోశెల్లోకి ఇలా గన్ పౌడర్ చేసి పెట్టుకోండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

05 April 2024, 15:30 IST

google News
    • Gun Powder: ఇడ్లీతో చట్నీల కన్నా గన్ పౌడర్ చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని ఒకసారి చేసుకుంటే నెలల పాటూ నిల్వ ఉంటుంది. గన్ పౌడర్ చేయడం చాలా సులువు.
ఇడ్లీలోకి గన్ పౌడర్
ఇడ్లీలోకి గన్ పౌడర్ (Youtube)

ఇడ్లీలోకి గన్ పౌడర్

Gun Powder: తెలుగిళ్లల్లో ఇడ్లీ, దోశెలు కచ్చితంగా ఉండాల్సిందే. వీటితో ఎప్పుడూ చట్నీలే కాదు, పొడులు వేసుకున్నా రుచిగా ఉంటుంది. ఒకసారి గన్ పౌడర్ చేసి పెట్టుకోండి... ఒకసారి చేసుకుంటే కొన్ని నెలల పాటూ నిల్వ ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.

గన్ పౌడర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శెనగపప్పు - నాలుగు స్పూన్లు

కరివేపాకులు - నాలుగు రెమ్మలు

బియ్యం - రెండు స్పూన్లు

మినపప్పు - రెండు స్పూన్లు

మిరియాలు - రెండు స్పూన్లు

ఎండు మిర్చి - యాభై గ్రాములు

ఉప్పు - రుచికి సరిపడా

కొబ్బరి పొడి - రెండు స్పూన్లు

నువ్వులు - రెండు స్పూన్లు

గన్ పౌడర్ రెసిపీ

1. ఇడ్లీలపై గన్ పౌడర్ చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టండి.

2. ఆ కళాయిలో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు వేసి నాలుగు నిమిషాలు వేయించాలి.

3. తరువాత బియ్యం, నువ్వులు వేసి వేయించాలి. అందులో కరివేపాకులు, ఎండు కొబ్బరి పొడి, మిరియాలు వేసి వేయించాలి.

4. వేయించిన దినుసులు అన్నీ మిక్సీ జార్లో వేయాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అంతే ఇడ్లీలోకి గన్ పౌడర్ రెడీ అయినట్టే.

5. ఇడ్లీ, దోశెలకు జతగా ఈ పొడిని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే దీన్ని మళ్లీ మళ్లీ తింటారు.

ఇడ్లీలతో ఎన్ని చట్నీలున్నా పక్కన కచ్చితంగా పొడి ఉండాల్సిందే. ఇడ్లీలపై ఈ పొడిని చల్లుకుని పైన నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. దోశెలు కాలుతున్నప్పుడు పైన ఈ పొడిని చల్లుకుని కాస్త నెయ్యి రాసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు. ఒక్కసారి ఈ పొడి చేసుకుంటే నెలల పాటూ నిల్వ ఉంటుంది. ఈ పొడి రుచిలో అదిరిపోతుంది. ఊతప్పం, దిబ్బరొట్టే వంటి వాటితో కూడా ఇది బావుంటుంది.

తదుపరి వ్యాసం