తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Roast Egg Curry । కోడిగుడ్డు కూరను ఇలా ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తింటారు

Ghee Roast Egg Curry । కోడిగుడ్డు కూరను ఇలా ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తింటారు

HT Telugu Desk HT Telugu

02 November 2022, 0:02 IST

google News
    • ఇలా కోడిగుడ్డు కూర వండుకొని తినండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. Ghee Roast Egg Curry Recipe చూడండి.
Ghee Roast Egg Curry Recipe
Ghee Roast Egg Curry Recipe

Ghee Roast Egg Curry Recipe

చాలా మందికి గుడ్లు అంటే ఫేవరెట్ ఫుడ్. వీటిని చాలా తక్కువ సమయంలో అనేక రకాలుగా వండుకోవచ్చు. ఎన్ని రకాలుగా వండినా రుచి ఎంతో బాగుంటుంది. గుడ్లను చిటికెలో ఫ్రై చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఉడికించి కూరలాగా కూడా చేసుకోవచ్చు. ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ కోసం బాయిల్డ్ ఎగ్ టోస్ట్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ కోసం కర్రీ వండుకోవచ్చు, సాయంత్రం రాగానే భుర్జీ చేసేసుకొని తినొచ్చు. ఇలా అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండే ఉత్తమమైన ప్రోటీన్ ఆహారం గుడ్డు.

మీరు కోడిగుడ్డు కూరను చాలా సార్లు తినే ఉంటారు. ఒకసారి ఇక్కడ పేర్కొన్న విధంగా చేసుకుని తిని చూడండి. దీని రుచి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ చలికాలంలో ఈ రకంగా కోడిగుడ్డు కూరను వండుకొని తింటుంటే ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కోడిగుడ్డు కూర రెసిపీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

Ghee Roast Egg Curry Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది
  • 2-3 టొమాటోలు
  • 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 2- పచ్చిమిర్చి
  • కొత్తిమీర
  • 1 టీస్పూన్ నెయ్యి
  • 1/2 కప్పు పెరుగు
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • 1/4 టీస్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా
  • 1 ఎర్ర మిరపకాయ
  • చిటికెడు పసుపు
  • 1/4 టీస్పూన్ ధనియాల పొడి
  • 1-2 ఏలకులు
  • 1 బిరియాని ఆకు
  • ఉప్పు తగినంత

ఘీ రోస్ట్ ఎగ్ కర్రీ తయారీ విధానం

  1. ముందుగా కోడిగుడ్లను ఉడికించాలి, ఆ తర్వాత వాటి తొక్కతీసి పక్కనపెట్టుకోండి
  2. ఇప్పుడు కడాయిలో నూనె వేడిచేసి, ఆపై నెయ్యి కూడా వేసి వేడిచేయాలి, నెయ్యి వేడయ్యాక అందులో గుడ్లను వేయించాలి.
  3. ఇప్పుడు గుడ్లను పక్కకు తీసి అదే కడాయిలో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఏలకులు వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  4. ఉల్లిపాయ రంగు మారడం ప్రారంభించినప్పుడు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి.
  5. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడులు వేసి వేయించాలి.
  6. టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత తాజా పెరుగు వేసి ఉడికించుకోవాలి. కొన్ని నీరు పోసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి.
  7. రసం మరిగిన తర్వాత గుడ్లకు గాట్లు పెట్టి ఇందులో ఒక 5 నిమిషాలు ఉడికించాలి.

ఆపై కొత్తిమీర చల్లుకొని మూతపెట్టుకొని రెండు నిమిషాలు ఉంచితే, ఘీ రోస్ట్ ఎగ్ కర్రీ రెడీ.

చపాతీ లేదా అన్నంతో కలిపి తినొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం