Skin Care Tips: ముఖంపై ముడతలు పోయి.. అందంగా కనిపించాలంటే ఈ పండ్లు తినండి!
02 July 2022, 15:47 IST
- Skin Care Tips: చర్మ సంరక్షణ చిట్కాలు: వయసుతో పాటు దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం చాలా మంది అనేక రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మానికి తీవ్ర నష్టం చేస్తాయి. అలాంటప్పుడు సహజ పద్దతుల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
Wrinkle-free Skin
అందంగా కనిపించాలని.. మెరిసే చర్మం కలిగి ఉండాలని అందరూ కోరుకుంటారు. జీవనశైలి, వాతావరణ కాలుష్యం కారణంగా అనేక చర్మ సమస్యలను ఎదర్కొంటున్నారు. అయితే చాలా మందిలో ఎదుర్కొనే చర్మ సమస్యలలో ఒకటి ముఖంపై ముడతలు వస్తాయి . ముడతలు ఒక సాధారణ సమస్య. వయస్సుతో పాటు, దుమ్ము, ధూళి, కాలుష్యం ముఖంపై ముడతలు, ఫైన్ లైన్లను కలిగిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ప్రజలు మార్కెట్లో లభించే అనేక రకాల సౌందర్య ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంది . అటువంటి పరిస్థితిలో సహజ మార్గం ద్వారా ముడతలను తొలిగించుకోవడం మంచిది. రోజు వారి డైట్లో పండ్లను చేర్చుకోవాలి. ఏ పండ్లు తినడం ద్వారా ముఖంపై ముడతలను ఎలా వదిలించుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం…
ముఖం ముడతలు పోవాలంటే ఈ పండు తినండి -
బొప్పాయి -
బొప్పాయి వృద్ధాప్యాన్ని నిరోధించే.. అద్భుత పోషకాలు ఉండే పండు. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్‌లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఇది ముడతలు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదనంగా, బొప్పాయిలో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగాన్ని మెరిసేలా.. అందంగా ఉంచుతాయి. కాబట్టి మీరు మీ ముఖంపై ముడతలతో బాధపడుతుంటే, ఆహారంలో బొప్పాయిని తప్పకుండా చేర్చుకోండి
బెర్రీ -
బెర్రీస్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, బెర్రీలలో విటమిన్లు ఎ, సి ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి చర్మానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా కళ్లను సురక్షితంగా ఉంచుతాయి.
దానిమ్మ -
దానిమ్మ వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. దీని చిన్న ఎర్రటి గింజలు ప్యూనికల్గిన్స్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి, ఇది చర్మంలో ఉండే కొల్లాజెన్ చక్కటి గీతలు మరియు ముడతలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని అందంగా మరియు యవ్వనంగా మార్చుతుంది.