తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fried Rice With Soya Chunks Recipe : లంచ్​లో ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్.. మిల్ మేకర్​తో ఇలా కూడా చేయవచ్చు..

Fried Rice with Soya Chunks Recipe : లంచ్​లో ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్.. మిల్ మేకర్​తో ఇలా కూడా చేయవచ్చు..

07 January 2023, 11:58 IST

google News
    • Fried Rice with Soya Chunks Recipe : లంచ్​లో ఎన్ని వెజిటెబుల్స్ ఉండేలా చూసుకుంటే అంత మంచిది. పైగా శనివారం చాలా మంది నాన్​వెజ్​కి దూరంగా ఉంటారు. అయితే మీరు ఈ సమయంలో మంచి టేస్టీ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్​తో ఉంటే మీకు సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ బెస్ట్ ఆప్షన్. 
ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్
ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్

ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్

Fried Rice with Soya Chunks Recipe : ఫ్రైడ్ రైస్ విత్ సోయా చంక్స్ అనేది శీఘ్ర, సులభమైన, రుచికరమైన వంటకం. ప్రత్యేకించి మధ్యాహ్న భోజనానికి ఇది పర్​ఫెక్ట్. వివిధ కూరగాయలతో, సోయాతో కలిపి తయారు చేసిన ఈ ఫుడ్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బాస్మతీ రైస్ - 2 కప్పులు

* క్యారెట్ - 1 కప్పు

* క్యాప్సికమ్ - 1 కప్పు

* బీన్స్ - 1 కప్పు

* పచ్చి బఠాణీలు - 1 కప్పు

* అల్లం పేస్ట్ - 1/2 టీస్పూన్

* వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

* పచ్చిమిర్చి - 2

* బిర్యానీ ఆకు - 2

* దాల్చిన చెక్క - 2

* యాలకులు - 2

* లవంగం - 1

* నూనె - 2 టేబుల్ స్పూన్స్

* మిల్ మేకర్ - 1 కప్పు

* ఉప్పు - తగినంత

* పంచదార - కొంచెం

తయారీ విధానం

సోయా చంక్స్​తో ఫ్రైడ్ రైస్ తయారు చేయడానకిి ముందుగా పాన్‌లో నీరు తీసుకుని.. ఉప్పు, సోయా వేయండి. సోయాను చల్లటి నీటిలో కడిగి వాటిని పిండి వేసి పక్కన పెట్టండి. అనంతరం నీరు పోసి మరిగించండి. ఉడికించిన నీటిలో పచ్చి బఠానీలు, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేయండి. ఈ కూరగాయలను కొన్ని నిమిషాల పాటు బ్లాంచ్ చేయండి.

ఇప్పుడు ఒక ప్రత్యేక పాత్రలో బియ్యం ఉడికించాలి. 2:1 నిష్పత్తిలో బాస్మతి లేదా ఏదైనా ఇతర పొడవాటి బియ్యం వండడం అంటే 1 కప్పు బియ్యం కోసం 2 కప్పుల నీరు తీసుకుని ఉడికించాలి. నీటిని తీసివేసి.. పెద్ద ప్లేట్ లేదా ట్రేలో బియ్యం వేయండి. కాసేపు చల్లారనివ్వండి. బియ్యాన్ని అతిగా ఉడికించవద్దు. ఇప్పుడు పాన్‌లో కొంచెం నూనె తీసుకుని.. దానిలో బే ఆకులు, దాల్చిన చెక్కలు, లవంగాలు, యాలకులు వేయాలి. వాటిని కొన్ని నిమిషాలు వేయించి తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి.

ఇప్పుడు దీనిలో ఉడికించిన సోయా చంక్స్ వేసి బాగా కలపాలి. అనంతరం కూరగాయలు వేయాలి. వాటిని కరకరలాడేలా రెండు నిమిషాలు టాసు చేసి.. అధిక మంటపై ఫ్రై చేయాలి. వాటిని మిక్సింగ్ చేసేటప్పుడు ఉప్పు, బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలపండి. వండిన అన్నాన్ని సోయాలో వేసి, కూరగాయలతో కొన్ని నిమిషాలు వేయించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే.. వేడి వేడి సోయా ఫ్రైడ్ రైస్ రెడీ.

తదుపరి వ్యాసం