తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spiced Rum Recipe : మీ రమ్​ని మరింత టేస్టీగా, స్పైసీగా మార్చుకోవాలంటే.. ఇలా చేసేయండి..

Spiced Rum Recipe : మీ రమ్​ని మరింత టేస్టీగా, స్పైసీగా మార్చుకోవాలంటే.. ఇలా చేసేయండి..

06 January 2023, 19:00 IST

google News
    • Spiced Rum Recipe : చాలామంది చలికాలంలో రమ్ తాగుతూ ఉంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది అనుకుంటారు. అందుకే దీనిని తాగుతారు. దీనిని మరింత టేస్టీగా, స్పైసీగా మార్చుకోవడానికి మీరు రమ్​ని మార్చుకోవచ్చు. అదేలాగంటే..
స్పైసీ రమ్ రెసిపీ
స్పైసీ రమ్ రెసిపీ

స్పైసీ రమ్ రెసిపీ

Spiced Rum Recipe : మీకు రమ్​ తాగే అలవాటు ఉందా? అయితే మీరు దానిని టేస్ట్​ని మరింత స్పైసీగా, టేస్టీగా మార్చుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కొత్త టేస్ట్​ని పొందాలనుకుంటే.. కచ్చితంగా ఈ స్పైసీ రమ్​ని రెడీ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* డార్క్ రమ్ - 750 ml

* లవంగాలు - 2

* ఏలకులు - 1

* స్టార్ సోంపు - 1

* దాల్చిన చెక్క స్టిక్ - 1/2

* జాజికాయ - చిటికెడు

* ఆరెంజ్ పీల్ - 1 స్ట్రిప్

మసాలా రమ్ తయారీ విధానం

రమ్​ను గాలి చేరని జార్​లోకి తీసుకోండి. నారింజ తొక్కను ట్విస్ట్ చేసి బాటిల్​లో వేయండి. మిగిలిన మసాలా దినుసులను కూడా వేసి.. మూత పెట్టి.. బాగా షేక్ చేయండి. రెండు మూడు రోజులు దానిని చీకటి ప్రదేశంలో ఉంచేయండి. అనంతరం మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టండి. ఈ మసాల రమ్​ను మరో బాటిల్​లోకి బదిలీ చేయండి. దానిని మూసి వేసి.. చీకటి, పొడి ప్రదేశంలో నిల్వ చేసుకుని.. మీకు నచ్చినప్పుడు తాగవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం