తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Masala Hot Chocolate Recipe : టేస్టీ టేస్టీ మసాలా హాట్ చాక్లెట్..

Masala Hot Chocolate Recipe : టేస్టీ టేస్టీ మసాలా హాట్ చాక్లెట్..

06 January 2023, 16:46 IST

google News
    • Masala Hot Chocolate Recipe : సాయంత్రం స్వీట్​ కోరికను దూరం చేస్తూ.. టీ ఫీల్​ కావాలి అంటే.. మీరు మసాలా హాట్ చాక్లెట్​ని ట్రై చేయాల్సిందే. దీనిని తయారు చేయడం చాలా సులభం. 
మసాలా హాట్ చాక్లెట్
మసాలా హాట్ చాక్లెట్

మసాలా హాట్ చాక్లెట్

Masala Hot Chocolate Recipe : శీతాకాలంలో మగతగా అనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం నుంచే స్లీపీ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే సాయంత్రం చాలామంది టీ తాగుతూ ఉంటారు. దానిలో మీరు కూడా ఒకరు అయితే.. మీ టీ, స్నాక్​ని కలిపే ఓ కాంబినేషన్ ఉంది. అదే మసాలా హాట్ చాక్లెట్. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటూ తాగుతారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలు - 2 కప్పులు

* ఏలకులు - 4

* లవంగాలు -4

* దాల్చిన చెక్క - 1

* కోకో పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు

* చక్కెర - 2 స్పూన్స్

మసాలా హాట్ చాక్లెట్ తయారీ విధానం

పాన్‌లో పాలు, మసాలా దినుసులు వేసి బాగా మరిగించాలి. దానిపై మూత వేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం కోకో పౌడర్ వేసి.. చక్కెర వేసి బాగా కలిపి.. సర్వ్ చేసుకోవాలి. అంతే మసాలా హాట్ చాక్లెట్ రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం