తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow These Tips To Reduce Stomach Bloating

Stomach Bloating : కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడకూడదంటే.. ఇవి ట్రై చేయండి..

09 June 2022, 13:17 IST

    • కడుపు ఉబ్బరం, గ్యాస్ వల్ల కలిగే ఇతర రుగ్మతలు క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు ఆహార నిపుణులు. అయితే కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి సింపుల్​ మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు. అవేంటో మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి.
కడుపు ఉబ్బరం
కడుపు ఉబ్బరం

కడుపు ఉబ్బరం

Stomach Bloating | ఏదైనా తిన్న తర్వాత మీ కడుపు బిగుతుగా అనిపిస్తుందా? లేదా ఇష్టమైనది బాగా లాగించాక ఆయాసం వచ్చేస్తుందా? ఇది తరచుగా జరుగుతుందంటే మీరు కడుపు ఉబ్బరంతో సతమవుతున్నారనే అర్థం. ఎక్కువగా తిని ఇబ్బందులు పడటం వేరు. తక్కువగా తిన్నాసరే చాలా మందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అయితే కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో సహాయపడే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కూడా ఇవి ఫాలో అయిపోయి కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోండి. లేకుంటే మీరు పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం ఎక్కువ అవుతుంది. అందుకే అలాంటి ఆహారాన్ని తగ్గించుకోవాలి. తిన్న తర్వాత ఓ చోట ప్రశాంతంగా కుర్చొని.. ఉబ్బరం తగ్గించుకోవడానికి పొత్తికడుపును మూడుసార్లు బాగా లాగి ఊపిరి పీల్చుకోండి. ఉబ్బరం నిరోధించడానికి గ్లూటెన్, చక్కెర, ఇతర శుద్ధి చేసిన ఆహారాలను మానేయండి.

మీరు తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమలండి. వేగంగా కాకుండా నిదానంగా దానిని నమిలి మింగండి. తిన్న తర్వాత 3 నుంచి 4 నిమిషాలు కూర్చుని విశ్రాంతి తీసుకోండి. కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ప్రోబయోటిక్ ఆహారాలను ఎక్కువగా తినండి. ప్రోబయోటిక్ అనేది శరీరంలో సహజంగా జీవించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఈస్ట్‌లను పెంచుతుంది. ఈ ఆహారాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి మీకు కడుపు ఉబ్బరం ఉండదు.

టాపిక్