తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Tips: మండే ఎండల్లో మీ ఇల్లు చల్లగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Summer tips: మండే ఎండల్లో మీ ఇల్లు చల్లగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Haritha Chappa HT Telugu

28 March 2024, 16:30 IST

google News
    • Summer tips: ఎండలు మొదలయ్యాయంటే ఇంట్లో వేడి పెరిగిపోతుంది. ఆ వేడి వాతావరణం కొందరికి సరిపడదు. మీ ఇంటిని చల్లగా ఉంచే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
సమ్మర్ టిప్స్
సమ్మర్ టిప్స్ (Pixabay)

సమ్మర్ టిప్స్

Summer tips: వేసవి మొదలైపోయింది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక మే నెల వస్తే రోళ్లు పగలడం ఖాయం. ఎప్పుడైతే వాతావరణంలో వేడి పెరుగుతుందో ఇంట్లో కూడా వేడి ఎక్కువైపోతుంది. ప్రతిసారీ రోజంతా ఏసీలు వేసుకొని ఉండలేము. ఎందుకంటే కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి సహజంగానే ఇంటిని చల్లగా ఎలా ఉంచుకోవాలో ఇక్కడ మేము చెబుతున్నాం. వీటిని ఫాలో అయితే కొంతమేరకు మీ ఇల్లు చల్లగా ఉండే అవకాశం ఉంది.

ఇల్లు చల్లగా ఉండాలంటే చిన్న చిన్న పనులు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లో బల్బులను మార్చండి. ఎల్ఈడి లైట్లను పెట్టుకోవడం వల్ల శక్తి ఆదా అవుతుంది. దీనివల్ల ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. అదే ట్యూబ్ లైట్లు వల్ల ఎక్కువ ఉష్ణం ఉద్గారం జరిగే అవకాశం ఉంది. ఇలా ఇలాంటి బల్బులను వాడడం వల్ల కొంత మేరకు ఉష్ణోగ్రత ఇంట్లో తగ్గుతుంది.

ఇంట్లో ఉన్నా కూడా కాటన్ వస్త్రాలను కచ్చితంగా వేసుకోండి. అవి వదులుగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు శ్వాస సరిగా ఆడుతుంది. శరీరం చల్లబడుతుంది. గాలి దుస్తులలోంచి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. అలాగే మంచాలపై కాటన్‌తో చేసిన దుప్పట్లను మాత్రమే పరచండి.

ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి వాటిలో ఐస్ క్యూబ్స్ వేసి గదికి ఒక మూల దాన్ని ఉంచండి. ఇప్పుడు ఫ్యాన్ వేయడం వల్ల ఫ్యాన్ గాలి ఆ చల్లదనాన్ని లాక్కుంటుంది. దీని వల్ల కూడా ఇల్లు కాస్త చల్లగా ఉంటుంది.

వేడి అధికంగా ఉన్నప్పుడు చల్లని నీటిని తాగుతూ ఉండండి. అలాగే చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో ముఖాన్ని తుడుచుకుంటూ ఉండండి. దీనివల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది.

ఇంట్లో చాలా గదులు ఉంటాయి. మీరు ఎక్కువగా వాడే గదిలోనే ఉండి... మిగతా గదులు తలుపులను వేసేయండి. వాటి ద్వారా వేడి మీరున్నచోటకి రాకుండా అడ్డుకోవచ్చు.

ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్లను వేసవిలో సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తిరిగేలా సెట్ చేయండి. దీనివల్ల గాలి నేరుగా కిందకి నెట్టడం జరుగుతుంది. దీనివల్ల శీతల ప్రభావం పుడుతుంది.

మీరు కచ్చితంగా ఏసీని వినియోగించాల్సిన పరిస్థితి ఉంటే ఏసీలో 24 నుంచి 27 సెంటీగ్రేడ్ల మధ్య మాత్రమే ఉష్ణోగ్రత ఉండేలా సెట్ చేసుకోండి. దీని వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతకన్నా తక్కువైనా కూడా శరీరానికి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మీ ఇంటి చుట్టూ కిటికీల దగ్గర, ద్వారాలు దగ్గర మొక్కలను కుండీలతో పెట్టేందుకు ప్రయత్నించండి. మొక్కలు దాదాపు వేడిని గ్రహిస్తాయి. చల్లని వాతావరణాన్ని ఉండేలా చూస్తాయి. ఇల్లు చల్లగా ఉండేందుకు బ్లైండ్లను మూసివేయండి. ముఖ్యంగా ఉత్తరం వైపు, పడమర వైపు ఉన్న కిటికీల దగ్గర కర్టెన్లను లేదా బ్లైండ్లను మూసి ఉంచడం మంచిది.

తరచూ నీళ్లు తాగడం మర్చిపోవద్దు. శరీరంలో నీళ్లు తాగితే డిహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. శరీరానికి ఎంత నీటిని అందిస్తే అంతగా వేడిని తట్టుకునే శక్తి దానికి వస్తుంది. వేడిగా ఉండే ఆహారాలు తినడం మానేయండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆహారాలే తినడం మంచిది. చక్కెర పానీయాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వేసవిలో చక్కెర పానీయాలు అధికంగా తాగితే డిహైడ్రేషన్ సమస్య ఎక్కువైపోతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం వల్ల శరీరం శక్తి పుంజుకుంటుంది.

డాబా ఇల్లు ఉన్నవారు తమ డాబాలపై మొక్కలను అధికంగా పెంచడం ద్వారా కిందకి వేడి దిగకుండా జాగ్రత్త పడవచ్చు. లేదా ఖాళీ ప్రదేశాలు ఉంటే ఇంటి పక్కనే ఒక మొక్కను నాటి అది చెట్టుగా ఎదిగేంత వరకు ఉండాలి. అది చెట్టుగా ఎదిగితే ఇంటిపై దాని నీడ పడి వేడి చాలా వరకు తగ్గుతుంది. ఇండివిడ్యువల్ ఇల్లులు ఉన్నవాళ్లు ఇలాంటి చెట్టును పెంచుకుంటే దీర్ఘకాలంలో ఎంతో ఉపయోగపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం