AC Buying Tips: వేసవి వచ్చేసింది, ఇంట్లో ఏసీ కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి-ac buying tips summer is here know these things before buying ac at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ac Buying Tips: వేసవి వచ్చేసింది, ఇంట్లో ఏసీ కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

AC Buying Tips: వేసవి వచ్చేసింది, ఇంట్లో ఏసీ కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Mar 27, 2024, 01:03 PM IST Haritha Chappa
Mar 27, 2024, 01:03 PM , IST

AC Buying Tips: వేసవి వచ్చేసింది.  రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ఏసీ కొనేందుకు సిద్దపడతారు. ఏసీ కొనేముందు ఎలా ఏసీ కొనాలో కొన్ని టిప్స్ తెలుసుకోండి.

మార్చి నెల ముగుస్తోంది. ఏప్రిల్ నుంచి వేసవి పెరిగిపోతుంది. వాతావరణంలో వేడి అధికమవుతుంది. చాలా మంది ఏసీ కొనేందుకు సిద్ధమవుతున్నారు.  అదే సమయంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని కూడా ఆలోచించాలి. ఏసీ కొనే విషయంలో కొన్ని టిప్స్ ఇక్కడ ఇచ్చాము.

(1 / 7)

వేసవిలో కొన్ని ఇళ్లలో వేడికి ముసలి వారు, పిల్లలు ఉండలేరు. వారి కోసం ఏసీ ఉండాలి. దాన్ని కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

(2 / 7)

కాపర్ కాయిల్ తో ఉన్న ఏసీ కొనడం చాలా మంచిది. ఇతర మెటల్ కాయిల్స్  ఉన్న ఏసీ కొనడం భవిష్యత్తుకు మంచిది కాదు. కాబట్టి కాపర్ కాయిల్ ఏసీనే కొనండి. దీని వల్ల కొంత విద్యుత్ కూడా ఆదా అవుతుంది.  

(3 / 7)

 కొత్త ఏసీని కొనుగోలు చేసేటప్పుడు బీఈఈ రేటింగ్ ను గమనించాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడం ఉత్తమం. దీని కోసం మీరు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ ఏసీలు చాలా విద్యుత్తును ఆదా చేస్తాయి. ఇది భవిష్యత్తులో డబ్బు ఖర్చును కూడా తగ్గిస్తుంది.  

(4 / 7)

విండో ఏసీతో పోలిస్తే స్ప్లిట్ ఏసీలో చాలా మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. అయితే, స్ప్లిట్ ఏసీ ధర కూడా ఎక్కువగా ఉంటుంది. స్ప్లిట్ ఏసీని ఏ గదిలోనైనా సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అదే విండో ఏసీని ఇన్ స్టాల్ చేసుకోవాలంటే కిటికీలు ఉండాలి. స్ప్లిట్ ఏసీలో ఆన్ బోర్డ్ స్లీపింగ్, టర్బో కూలింగ్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లు లభిస్తాయి. వీటిలో ఏది మీకు ముందుగా అవసరమో ఆలోచించండి.  

(5 / 7)

ఏసీ కొనేటప్పుడు ఖచ్చితంగా గది పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ గది పరిమాణం 100 నుంచి 120 చదరపు అడుగులు ఉంటే 1టన్ ఏసీ కొనుక్కోవచ్చు. మీ ఇల్లు ఇంతకంటే పెద్దదైతే ఈఒకటిన్నర నుంచి రెండు టన్నుల ఏసీ మీ ఇంటికి మంచిది. లేకపోతే ఏసీలో ఒత్తిడికి గురవుతుంది.

(6 / 7)

ఏసీ కొనేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చాలా ఏసీల్లో పెర్ ఫ్యూమ్ ఫిల్టర్లు, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్లు కూడా ఉంటాయి. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి ఫిల్టర్లతో ఏసీ కొనడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు