Good Sleep Tips : ఉదయం ఫ్రెష్‌గా ఉండాలి, రాత్రి బాగా నిద్రపోవాలి అంటే సాయంత్రం ఇలా చేయాలి
30 January 2024, 20:00 IST
- Daily Evening Tips : రోజూ మనం పాటించే అలవాట్లతోనే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉదయం, రాత్రి సరిగా ఉండాలంటే కచ్చితంగా సాయంత్రం మనం చేసే పనులు బాగుండాలి.
నిద్ర చిట్కాలు
రిఫ్రెష్ ఉదయం అంటే బాగా రాత్రి నిద్రపోవడమే. మీరు రాత్రిపూట సరిగా నిద్రపోవాలంటే.. మునుపటి సాయంత్రం నుండి దాని కోసం సిద్ధం చేయడం ప్రారంభించాలి. మంచి నిద్ర రావాలంటే, ఉదయం ఫ్రెష్ గా కనిపించాలంటే సాయంత్రం పూట ఏం చేయాలో తెలుసుకోవాలి.
ఉదయం లేవగానే మన మూడ్ బాగుంటే ఆ రోజంతా బాగుంటుంది. లేదంటే చికాకుగా ఉంటాం. అయితే మీ ఉదయం మరింత ఫ్రెష్ గా ఉండాలి అంటే ముందు సాయంత్రం నుంచే ప్రిపేర్ అవ్వాలి. మంచి ఉదయం పొందాలంటే మంచి రాత్రి నిద్ర ఒక్కటే మార్గం. మంచి రాత్రి నిద్ర అంటే మీరు విశ్రాంతి కోసం మీ నాడీ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. మరుసటి రోజు కొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి మీ శరీరాన్ని రీఛార్జ్ చేయడం చాలా అవసరం. మీరు మంచి నిద్ర ద్వారా మాత్రమే ఈ రీఛార్జ్ పొందవచ్చు. సరైన నిద్ర పొందడానికి, మీ ఉదయాన్నే ఫ్రెష్‌గా మార్చడానికి కొన్ని విషయాలు పాటించాలి.
పనికి బ్రేక్ ఇవ్వాలి
నిత్యం పనిలో బిజీగా ఉండే మనం పని అయిపోగానే ల్యాప్ టాప్ లు మూసేసి పని గురించి ఆలోచించడం మానేయాలి. బదులుగా సాయంత్రం ఆనందంగా గడపడం గురించి ఆలోచించండి. మీరు ఎక్కువగా పని గురించే ఆలోచిస్తూ ఉంటే నిద్ర సరిగా ఉండదు. దీంతో మరుసటి రోజు ఉదయం కూడా పాడైపోతుంది. పని గురించి
సాయంత్రం నుంచే సిద్ధమవ్వాలి
రేపు ఉదయం మీరు చేయాలనుకున్న పనులకు సాయంత్రం నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు రేపు ఉదయం ఆఫీసుకు వెళ్లాలంటే ఇస్త్రీ చేసిన బట్టలు కావాలి. అందుకే ముందు రోజు బట్టలకు ఐరన్ వేసుకుంటే మరుసటి రోజు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇది ఉదయం ఇస్త్రీ చేసే సమయాన్ని ఆదా చేస్తుంది. ఏదైనా షెడ్యూల్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు కూడా అంతే చేయాలి. రేపటి పనిని ఇప్పుడే చేస్తే మెంటల్ టెన్షన్ ఉండదు.
సంగీతం వినాలి
సాయంత్రం పని ముగించుకుని మసక వెలుతురులో మధురమైన సంగీతాన్ని వినాలి. మీరు ఉన్న గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేదని కూడా నిర్ధారించుకోవాలి. మంచి గాలి, సంగీతం మిమ్మల్ని అన్ని చింతల నుండి దూరం చేస్తుంది. మీకు విశ్రాంతి అనుభూతిని ఇస్తుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
డైరీ రాయండి
డైరీ రాయడం కూడా మంచి పద్ధతి. రోజంతా మీ జీవితంలో జరిగిన అన్ని మంచి విషయాల గురించి డైరీని రాస్తే బెటర్. మిమ్మల్ని మీరు వెతుక్కోవచ్చు. ఇది మంచి మానసిక స్థితిలో నిద్రపోవడానికి మీకు సహాయపడుతుంది. నెరవేరిన లక్షాలను చూసుకుంటే మనసుకు తృప్తి కలుగుతుంది. చేయాలనుకున్న పనులను కూడా చేసేందుకు ప్రేరణ వస్తుంది.
గాడ్జెట్‌లకు దూరంగా ఉండాలి
నిద్రించడానికి గంట సమయం ఉన్నప్పుడు మొబైల్, టీవీతో సహా అన్ని గాడ్జెట్‌లకు దూరంగా ఉండాలి. రోజంతా పనిచేసి అలసిపోయిన మీ కళ్లకు పడుకునే ముందు గంట ముందు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్లు చూస్తూ కూర్చొంటే ఎంత రాత్రైనా నిద్ర రాదు. ఇది మరసుటి రోజు ఉదయం మీత ప్రభావం చూపిస్తుంది.
ధ్యానం చేయాలి
ఒక గంట మీరు ధ్యానం చేయవచ్చు. దీంతో మీ శరీరం చాలా రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే రోజూ పడుకునే ముందు ధ్యానం చేస్తే తప్పకుండా మంచి నిద్ర వస్తుంది. ఈ విధంగా సాయంత్రం మంచి నిద్ర కోసం వివిధ పనులు చేయడం ద్వారా, మీరు మంచి రాత్రి నిద్ర పొందవచ్చు. ఉదయాన్నే చాలా రిఫ్రెష్‌గా ఉండొచ్చు.