తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Flour Recipes: రాగిపిండి రుచి నచ్చట్లేదా.. రుచికరమైన వంటలివే..

ragi flour recipes: రాగిపిండి రుచి నచ్చట్లేదా.. రుచికరమైన వంటలివే..

22 May 2023, 15:44 IST

google News
  • ragi recipes: వేసవిలో చలువ చేసే ధాన్యాల్లో రాగులు కూడా ఉంటాయి. అయితే వాటి వల్ల కలిగే లాభాలు, వాటిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం. 

రాగులతో వంటలు
రాగులతో వంటలు (Pinterest)

రాగులతో వంటలు

రాగుల వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ చిరుదాన్యంలో కొవ్వు ఉండదు. పీచు, క్యాల్షియం, ఐరన్ ఇంకెన్నో పోషకాలుంటాయి. రోజూవారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పెంచడంలో, బరువు తగ్గించడంలో సాయపడతాయి. దీనికి చలువ చేసే గుణాలుండటం వల్ల వేసవిలో తీసుకోదగ్గ ఉత్తమ ఆహారం. ఆయుర్వేదం ప్రకారం కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది సాయపడుతుంది. వెజిటేరియన్లకు మంచి ప్రొటీన్ దొరికే ఆహారం ఇది.

రాగులు అంటే ఏంటి?

ఇదొక చిరుదాన్యం (millet). ఆఫ్రికా, ఆసియా, ఇథియోపియా, శ్రీలంక ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి. చూడటానికి ఆవాల లాగా ఉంటాయి. పొడిచేసి వీటిని తినొచ్చు. దోసెలు, రొట్టెలు, ఇడ్లీ, ఉప్మా, పరాఠా, హల్వా, బర్ఫీ లాంటి అనేక వంటకాలు రాగిపిండితో చేసుకోవచ్చు. పాలిషింగ్ లేకుండా వీటిని నేరుగా వాడుకోవచ్చు. అందుకే ఆరోగ్యం కూడా.

రాగులతో వంటకాలు..

రాగి మిల్క్‌షేక్: నీళ్లు పోసి ఉడికించుకున్న రాగి జావలో, పాలు, అరటిపండు, తేనె వేసి మిక్సీ పట్టటండి. వేసవిలో తాగదగ్గ చల్లటి పానీయం సిద్దం.

రాగి దోశ: రాగిపిండిలో నూనె, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసుకుని దోశలాగా పోసుకోవచ్చు. రాగిదోశ కోసం పిండి కూడా పులవాల్సిన అవసరం లేదు.

రాగి సలాడ్: రాగులను ఉడికించుకోవాలి. దాంట్లో క్యాప్సికం, కీరదోస, టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసవిలో తినదగ్గ మంచి స్నాక్ ఇది. కాస్త నిమ్మరసం, ఉప్పు, పుదీనా, ఆరిగానే లాంటివి వేసుకుంటే రుచి పెరుగుతుంది.

రాగి ప్యాన్ కేక్: రాగిపిండిలో గుడ్డు సొన, మజ్జిగ, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని దోసె కన్నా మందంగా చిన్నగా వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ మీద తేనె లేదా పండ్లు పెట్టి సర్వ్ చేయొచ్చు.

రాగుల లాభాలు:

1.క్యాల్షియం, ఐరన్, పీచు:

రాగుల్లో క్యాల్షియం ఎక్కువ. ఎముక ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఐరన్, పీచు ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఆహారం జీర్ణమవడంలో సాయపడతాయి.

2. గ్లుటెన్ లేని ఆహారం:

గోదుమల్లో లాగా దీంట్లో గ్లుటెన్ ఉండదు. గ్లుటెన్ పడని వాళ్లు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

3. షుగర్:

రాగుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి.

4. గుండె వ్యాధులు:

రాగుల్లో ఉన్న పీచు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావు.

5. బరువు:

బరువు తగ్గాలనునే వారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తరచూ ఏదైనా తినాలనే కోరిక కూడా తగ్గిస్తుంది.

తదుపరి వ్యాసం