తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: త్వరగా బరువు తగ్గేందుకు 5 గోల్డెన్ రూల్స్ చెప్పిన ఫిట్‍నెస్ ట్రైనర్.. 20 కేజీలు తగ్గాడట

Weight Loss: త్వరగా బరువు తగ్గేందుకు 5 గోల్డెన్ రూల్స్ చెప్పిన ఫిట్‍నెస్ ట్రైనర్.. 20 కేజీలు తగ్గాడట

15 November 2024, 16:30 IST

google News
    • Weight Loss: బరువు తగ్గాలనుకునే వారి కోసం ఓ ఫిట్‍నెస్ ట్రైనర్ ఐదు సూచనలు చేశారు. తన వెయిట్ జర్నీని వెల్లడించారు. 20 కేజీల బరువు తగ్గానంటూ ఆ రూల్స్ ఏవో చెప్పారు.
Weight Loss: త్వరగా బరువు తగ్గేందుకు 5 గోల్డెన్ రూల్స్ చెప్పిన ఫిట్‍నెస్ ట్రైనర్.. 20 కేజీలు తగ్గాడట
Weight Loss: త్వరగా బరువు తగ్గేందుకు 5 గోల్డెన్ రూల్స్ చెప్పిన ఫిట్‍నెస్ ట్రైనర్.. 20 కేజీలు తగ్గాడట

Weight Loss: త్వరగా బరువు తగ్గేందుకు 5 గోల్డెన్ రూల్స్ చెప్పిన ఫిట్‍నెస్ ట్రైనర్.. 20 కేజీలు తగ్గాడట

బరువు తగ్గే విషయంపై సోషల్ మీడియాలో సూచనలు, టిప్స్ ఇచ్చే వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. చాలా మంది తమ వెయిస్ లాస్ జర్నీని వివరిస్తున్నారు. తాము పాటించిన విధానాలను వెల్లడిస్తున్నారు. సుప్రతీమ్ చౌదరి అనే ఫిట్‍నెస్ ట్రైనర్, న్యూట్రిషన్  కూడా తరచూ బరువు తగ్గే విషయంపై టిప్స్ ఇస్తుంటారు. తాను 20 కేజీల బరువు తగ్గేందుకు ఏ రూల్స్ పాటించానో, తన జర్నీ ఏంటో వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఐదు రూల్స్ ఇవే

బరువు తగ్గేందుకు తాను పాటించిన ఐదు రూల్స్ గురించ సుప్రతీమ్ వెల్లడించారు. “త్వరగా బరువు తగ్గేందుకు ఐదు గోల్డెన్ రూల్స్ ఇవి.. నేను ఇవి ఫాలో అయి 20 కేజీలు తగ్గాను. మొదటిది: రాత్రి డిన్నర్‌ 7 - 8 గంటల మధ్యలో చేయండి. రెండోది: ప్రతీ రోజు 3 - 4 లీటర్ల నీరు తాగాలి. మూడోది: క్యాలరీల లోపం ఉండేందుకు ప్రతీ రోజు కావాల్సిన దాని కంటే 50 శాతం తక్కువగా తినేందుకు ప్రయత్నించాలి. నాలుగోది: ప్రతీ రోజు 30 - 40 నిమిషాల సింపుల్ వర్కౌట్స్ చేయాలి. ఐదోది: బరువు తగ్గాలనుకునే ప్రయాణంలో ఒత్తిడికి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యం” అని సుప్రతీమ్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

ఇంటి ఫుడ్డే తినాలి

వెయిట్ లాస్‍ జర్నీలో ఆహారం విషయం గురించి మరో వీడియోలో వివరించారు సుప్రతీమ్ చౌదరి. కఠినమైన డైట్ పాటించకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు ఐదు టిప్స్ పంచుకున్నారు. “రూల్ 1: ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి. రూల్ 2: తినేందుకు టైమింగ్ ఫిక్స్ చేసుకోండి. రూల్ 3: మీ ఆహారంలో ప్రోటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, కూరగాయల సలాడ్ లాంటి అన్ని రకాల మాక్రోన్యూటియంట్స్ ఉండేలా చూసుకోవాలి. రూల్ 4: సరిపడా మాత్రమే తినండి.. పొట్టను నింపేయొద్దు. రూల్ 5: తినే సమయంలో ఎలాంటి డివైజ్‍లు వాడొద్దు. అవి మీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి” అని సుప్రీతమ్ వెల్లడించారు.

బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉండే పోషకాహారాలను తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్‍లు, జంక్ ఫుడ్‍లు, ఫ్రైడ్ ఫుడ్‍లు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

బరువు తగ్గాలంటే పోషకాహారం తినడంతో పాటు వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. వెయిట్ లాస్ కావాలనుకుంటున్న వారు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. క్యాలరీలను బర్న్ చేయాలి.

తదుపరి వ్యాసం