తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bmi Calculator: మీరు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేక ఎక్కువ ఉన్నారో ఈ చిన్న లెక్క ద్వారా తెలుసుకోండి

BMI calculator: మీరు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేక ఎక్కువ ఉన్నారో ఈ చిన్న లెక్క ద్వారా తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

22 August 2024, 9:30 IST

google News
  • BMI calculator: ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉండడం చాలా అవసరం. మీరు మీ ఎత్తును బట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.  ఎత్తును బట్టి బరువును కలిగి ఉన్నారో లేదో బీఎమ్ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంట్లో బీఎమ్ఐ ను తెలుసుకోవచ్చు. 

మీ బిఎమ్ఐ ఎంత? ఇలా తెలుసుకోండి
మీ బిఎమ్ఐ ఎంత? ఇలా తెలుసుకోండి (shutterstock)

మీ బిఎమ్ఐ ఎంత? ఇలా తెలుసుకోండి

ఆరోగ్యంగా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో కొవ్వు పెరిగితే బరువు పెరిగి ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ మీ శరీర బరువు మీ ఎత్తుకు తగ్గట్టు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. మీ ఎత్తును బట్టే మీరు ఎంత బరువు ఉండాలో నిర్ణయమవుతుంది. బీఎమ్ఐ ద్వారా మీరు ఆరోగ్యకరమైన బరువు, ఎత్తులను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.

బీఎమ్ఐ అంటే ఏమిటి?

బీఎమ్ఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీరు ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉన్నారో లేదో చెప్పే ఒక మెడికల్ స్క్రీనింగ్ విధానం ఇది. బీఎమ్ఐ అనేది శరీర కొవ్వుతో కూడా సంబంధ కలిగి ఉంటుంది. బీఎమ్ఐ ద్వారా మీరు అధిక బరువు ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. అధిక బరువు ఉంటే మీలో కొవ్వు పేరుకుందని అర్థం చేసుకోవాలి. బీఎమ్ఐ స్కోర్ పెరిగే కొద్దీ మీ శరీరంలోని కొవ్వు కూడా పెరుగుతోందని అర్థం చేసుకోవాలి.

మీరు ఉండాల్సిన బరువు ఇలా తెలుసుకోండి?

మీ శరీర బరువు మీ ఎత్తును బట్టి ఎలా ఉండాలో తెలుసుకునేందుకు వైద్యులను కలవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులువుగా మీరు తెలుసుకోవచ్చు. దీనికి చాలా సులభమైన మార్గం ఉంది. మీరు శరీర పొడవు నుండి 100ను తీసివేయండి. అదే మీరుండాల్సిన ఆరోగ్యకరమైన బరువు. ఉదాహరణకు, మీ ఎత్తు 175 సెంటీమీటర్లు అనుకుందాం. 175 లోంచి 100 తీసివేస్తే 75 వస్తుంది. అంటే 175 సెంటీమీటర్లున్న ఎత్తు ఉన్న మీరు 75 కిలోల బరువు ఉండడం సరైనది. అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు బరువు పెరుగుతున్నట్టు లెక్క.

హైబీపీ, డయాబెటిస్ ఉంటే…

మీ కుటుంబ చరిత్రలో ఎవరిరైనా హైబీపీ, డయాబెటిస్ ఉంటే మీ ఎత్తు నుంచి 105ను తీసివేయాలి. అది మీ ఆరోగ్యకరమైన బరువుగా భావించాలి. ఆరోగ్యకరమైన బరువుతో వ్యాధుల వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

మహిళలకు

మహిళలు తాము ఉండాల్సి ఆరోగ్యకరమైన శరీర బరువును తెలుసుకోవాలనుకుంటే, మీ ఎత్తు నుండి 105ను తీసివేయాలి. మీ కుటుంబంలో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల చరిత్ర ఉంటే మీ ఎత్తు నుంచి 110ను తీసివేయాలి. వచ్చిన ఫలితం ఆరోగ్యకరమైన బరువుగా చెప్పుకోవాలి.

ఈ పద్ధతిలో మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో, ఎంత బరువు ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.

మీ బరువు ఎత్తుకు తగ్గట్టు ఉండాలి. బీఎమ్ఐ ఎక్కువగా ఉంటే... అంటే ఎత్తుకు అవసరమైన బరువు కన్నా, ఎక్కువ బరువు ఉంటే మీలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, గురక, స్లీప్ అప్నియా, కీళ్ల వ్యాధులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిన అవసరం ఉంది. అధిక బరువు ఉంటే వ్యాయామం, ఆహారపు అలవాట్లు, నడక ద్వారా తగ్గించుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం