New Study: షాకింగ్ అధ్యయనం, పరీక్ష హాలు సీలింగ్ మరీ ఎత్తుగా ఉండే విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరట
New Study: ఒక ఆస్ట్రేలియన్ అధ్యయనం అధిక సీలింగ్ ఉన్న పెద్ద గదులు మిమ్మల్ని మరింత దృష్టి మరల్చడానికి మరియు మీ పరీక్ష స్కోరును తగ్గించడానికి ఎలా కారణమవుతాయో వెల్లడిస్తుంది.

విద్యార్థులకు సంబంధించి ఇదొక షాకింగ్ అధ్యయనం అని చెప్పుకోవాలి. పరీక్షలకు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ హాల్లోని సీలింగ్ ఎత్తుగా ఉంటే మాత్రం విద్యార్థులు పరీక్ష సరిగా రాయలేరట. పరీక్షకు ముందు ఎన్నిసార్లు చదివినా కూడా ఎగ్జామ్ హాల్ సీలింగ్ ఎత్తుగా ఉంటే మాత్రం మీ అంచనాల కంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, డీకిన్ యూనివర్శిటీలు కలిపి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఆ అధ్యయనంలోనే ఈ కొత్త ఫలితం తేలింది. తాజా అధ్యయనంలో అకడమిక్ పనితీరుకు, ఆర్కిటెక్చర్ కు మధ్య ఉన్న ఈ వింత అనుబంధం బయటపడింది. విద్యార్థులు అధిక సీలింగ్ ఉన్న పెద్ద గదుల్లోకి తీసుకువెళ్లినప్పుడు పరీక్షల్లో తక్కువ ప్రతిభ కనబరుస్తారన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది.
ఎత్తయిన సీలింగ్ వల్ల
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వివిధ విశ్వవిద్యాలయ క్యాంపస్ లలో ఎనిమిదేళ్ల పాటూ పరిశోధన చేశఆరు. ఇందులో భాగంగా 15,400 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను పరిశీలించారు. విశ్లేషణలో భాగంగా విద్యార్థుల విద్యా, సామాజిక ఆర్థిక స్థితి, వయస్సు, లింగం, పరీక్ష రాసేటప్పుడు విద్యార్థుల అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నారు.
వర్చువల్ రియాలిటీ టెస్ట్ (విఆర్) ఫలితాలకు మద్దతు ఇచ్చింది. అధ్యయనంలో భాగంగా విద్యార్థులను వేర్వేరు గదుల్లో ఉంచి చూశారు. శబ్దం, ఉష్ణోగ్రత వంటి పర్యావరణ పరిస్థితులను మార్చారు. వారి ఆందోళన స్థాయిలను అర్థం చేసుకోవడానికి హృదయ స్పందన రేటు, శ్వాస, చెమట కొలతలు తీసుకున్నారు. ఈ విఆర్ ప్రయోగాలలో, పరిశోధకులు ఎత్తయిన సీలింగ్ ఉన్న గదిలో కూర్చోవడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత చెదిరిపోతున్నట్టు గుర్తించారు. వచ్చిన ప్రశ్నలకు కూడా వారు సరిగా జవాబులు రాయలేకపోతున్నట్టు గుర్తించారు.
పరీక్షల కోసం పెద్ద ఖాళీలు తయారు చేయబడవు
పెద్ద గదులు ఎక్కువ శాతం ఖాళీ ప్రదేశాలను కలిగి ఉంటాయి. ఇవి పెద్ద సమావేశాల కోసం నిర్మిస్తారు. ప్రదర్శనలు, ఈవెంట్లు, థియేటర్ , వ్యాయామశాలలు వంటి సామాజిక కార్యకలాపాలకు ఇవి సరిపోతాయి. కానీ ఇవి మెదడులోని అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేస్తుందని మాత్రం ఊహించలేకపోయారు. దృష్టి , పనితీరుకు కూడా ఈ పెద్ద గదుల్లు, ఎత్తయిన సీలింగులు ఆటంకం కలిగిస్తాయి. ఆస్ట్రేలియా, భారతదేశం, అనేక ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాలలో ఇలాంటి పెద్ద హాళ్లను నిర్వహిస్తారు.
గది ఎత్తైన పైకప్పును కలిగి ఉంటే ఇది ఆందోళన, ఒత్తిడి వంటి భావాలను ప్రేరేపిస్తుంది. ఈ విపరీతమైన భావోద్వేగాలు దృష్టిని మారుస్తాయి. దీని వల్ల విద్యార్థులు సరిగా పరీక్షలు రాయలేరు. రెండవది, పెద్ద గదుల్లో ఎక్కువ మంది విద్యార్థులను ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఇది పేలవమైన గాలి ప్రసరణకు దారితీస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక శ్రేయస్సుకు భంగం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల కూడా విద్యార్థులు అలాంటి గదిలో సరిగా చదవలేరు, పరీక్షలు రాయలేరు. అందుకే విద్యార్థులకు అనువైన గదుల్లో ఉంచడం వల్ల వారు చక్కగా చదివే అవకాశం ఉంది.