world asthma day: వేసవిలో ఆస్థమా పెంచే కారకాలివే..
02 May 2023, 12:56 IST
world asthma day: ఆస్థమాతో బాధపడేవారికి వేసవిలో ఇంకాస్త ఇబ్బంది ఉంటుంది. వ్యాధిని ఎక్కువ చేసే కొన్ని కారకాల గురించి తెలుసుకుంటే ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
World Asthma Day is observed every year on May 2.
ఎండాకాలంలో వేడి వల్ల ఆస్థమా బాధితులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువయే అవకాశం ఉండి. వేడివల్ల గాలిగొట్టాల మార్గం సన్నబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. వేసవిలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆస్థమా ఉన్నవాళ్లకి కాస్త కష్టంగా ఉంటుంది. అందుకే వీలైనంత ఇంటిపట్టునే ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో కూడా గాలి ప్రసరణ బాగుండేలా చూసుకోవాలి. లేదంటే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. మన జీవన విధానంలో మార్పులు చేసుకుని వ్యాధి కారకాలకు దూరంగా ఉండటమే ఆస్థమా అదుపులో పెట్టుకోడానికి మార్గాలు. ముఖ్యంగా వేసవిలో వ్యాధిని పెంచే కారకాలేంటో తెలుసుకోండి.
వేసవిలో ఆస్థమా కారకాలు:
తేమ:
తేమతో కలుషితంగా ఉన్న గాలి వల్ల ఆస్థమా ఉన్నవాళ్లకి శ్వాస లో ఇబ్బంది ఎదురవుతుంది.
గాలి కాలుష్యం:
కలుషితమైన గాలిని పీల్చుకోవడం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా ఆస్థమా ఉన్నవాళ్లకి కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మీద ప్రభావం పడుతుంది. ఆస్థమా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో కూడా గాలి ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూసుకోవాలి.
పుప్పొడి:
వేసవికాలంలో పుప్పొడి రేణువులు, లేదా వివిధ ఎలర్జీలు కలగజేసే కారకాల ప్రభావం ఉంటుంది. ఇవి ఆస్థమా లక్షణాలను పెంచుతాయి. కొంతమందికి జ్వరం కూడా రావచ్చు. ఆస్థమా ఎక్కువ అవ్వచ్చు.
కీటకాలు:
కొన్ని రకాల కీటకాలు కుట్టడం వల్ల ఎలర్జీ రియాక్షన్లు జరిగి ఆస్థమా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
వ్యాయామం:
మందులు, కొన్ని జాగ్రత్తలు, వ్యాయామం.. ఆస్థమా రోగులకు చాలా శ్రేయస్కరం. కానీ వేసవిలో మీరు చేసే వ్యాయామంలో ఎలాంటి మార్పులు చేయాలో ముందుగానే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
వీటన్నింటితో పాటే బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, వీలైనన్ని ఎక్కువ నీళ్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా మందులు వాడటం వల్ల ఆస్థమాను అదుపులో పెట్టుకోవచ్చు.