Aadhaar Card for Children : మీ పిల్లలకు ఆధార్ కార్డ్ లేదా? ఇలా సింపుల్‌గా అప్లై చేయండి..
16 June 2022, 10:40 IST
- పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. అయితే చిన్న పిల్లలకు మాత్రం బయోమెట్రిక్ తీసుకోరు. మరి వారికి ఆధార్ కార్డ్ ఎలా పొందాలి అనే ప్రశ్నలు మీలో ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే. పిల్లలకు ఆధార్ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు ఆధార్ కార్డ్ అప్లై చేయండి ఇలా..
Aadhaar For Child: చాలా పాఠశాలలు అడ్మిషన్ ప్రక్రియల సమయంలో పిల్లల ఆధార్ నంబర్‌ను అడుగుతున్నాయి. ఇప్పుడసలే స్కూల్స్ ప్రారంభమయ్యే సమయం కాబట్టి దీని అవసరం చాలా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు ఇంకా ఆధార్ కార్డుకు అప్లై చేయకపోతే.. ఇప్పుడే అప్లై చేసేయండి. అయితే ఈ ప్రక్రియకు అవసరమయ్యే పత్రాలేంటో.. ప్రోసెస్ ఏమిటో మీకు తెలియదా? అయితే కంగారు పడకండి. ఇది చదివేసి.. సులభంగా మీ పిల్లలకు ఆధార్‌కార్డు కోసం అప్లై చేయండి.
అవసరమైన పత్రాలివే..
1. పిల్లల జనన ధృవీకరణ పత్రం
2. తల్లిదండ్రులలో ఒకరి ఆధార్
ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి
* UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను (https://uidai.gov.in/) సందర్శించండి.
* ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లి దానిపై క్లిక్ చేయండి.
* పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఇ-మెయిల్ చిరునామా వంటి అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపండి.
* మొత్తం జనాభా సమాచారాన్ని పూరించండి.
* కొనసాగించడానికి ఫిక్స్ అపాయింట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవడానికి ఒక తేదీని సెట్ చేయండి.
* దరఖాస్తుదారు సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని ఎంచుకోవడం ద్వారా నమోదు ప్రక్రియను కొనసాగించవచ్చు.
* సమీపంలోని ఆధార్ కార్డ్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
* తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్‌తో పాటు ఫారమ్‌ను సమర్పించండి.
* తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ సమాచారం, మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి.
* ధృవీకరణ ప్రక్రియ తర్వాత, పిల్లల ఫోటో తీస్తారు.
* పిల్లలకు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. ఫోటోగ్రాఫ్, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ డేటా తీసుకుంటారు.
* భవిష్యత్తు అవసరాల కోసం కేంద్రంలో మీకు అందించిన రసీదు స్లిప్‌ను సేవ్ చేయండి.
* ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ సమాచారం తీసుకోరు. అయితే ఐదేళ్లు వచ్చిన తర్వాత మాత్రం బయోమెట్రిక్‌లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
టాపిక్