Tea Time Snack | క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్ ఛాయ్‌తో సూపర్ గుడ్ కాంబినేషన్!
21 March 2022, 7:44 IST
- క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్ ఒక్కసారి రుచి చూస్తే ఇంకెప్పుడూ ఇదే కావాలని అంటారని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ అంటున్నారు. ఛాయ్‌తో క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్ సూపర్ గుడ్ కాంబినేషన్ అని చెప్తున్నారు.
Crispy Bread Snack by Kunal Kapur
మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇండియన్స్ ఎక్కువగా ఛాయ్ తాగటానికి ఇష్టపడతారు. రోజులో కొంచెం బ్రేక్ టైమ్ దిరికినపుడు కూడా ఛాయ్ గుర్తుకొస్తుంది. ఆ సమయంలో ఒక కప్ ఛాయ్ మనకు కంపనీ ఇస్తుంది. అయితే ఛాయ్‌తో పాటు సమోసా, బ్రెడ్ ఆమ్లెట్, పకోడి లాంటివి తినడం చాలా మందికి అలవాటు. కానీ మీరేప్పుడైనా క్రిస్పీ బ్రెడ్ ట్రై చేశారా?
ఈ స్నాక్స్ ఒక్కసారి రుచి చూస్తే ఇంకెప్పుడూ ఇదే కావాలని అంటారని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ అంటున్నారు. ఛాయ్‌తో క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్ సూపర్ గుడ్ కాంబినేషన్ అని చెప్తున్నారు. దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఆ రెసిపీని కూడా ఆయన పంచుకున్నారు.
క్రిస్పీ బ్రెడ్ స్నాక్స్- చెఫ్ కునాల్ కపూర్ రెసిపీ కోసం కావలసినవి:
3/4 కప్పు బంగాళాదుంప (ఉడికించి గుజ్జుగా మార్చినవి)
1 tsp జీలకర్ర
2 tsp తరిగిన అల్లం
1 పచ్చి మిరపకాయ
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
2 స్పూన్ కారం
ఉప్పు రుచికి తగినంత
4 బ్రెడ్ ముక్కలు
బ్యాటర్ కోసం
1 కప్పు శనగపిండి
1 టీస్పూన్ ఓమ
1 స్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
1/2 టీస్పూన్ పసుపు
3/4 కప్పు నీరు
2 టేబుల్ స్పూన్లు నూనె
తయారీ విధానం
* ముందుగా పైన పేర్కొన్న బంగాళాదుంప గుజ్జు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి (కారం) ఉప్పు పదార్హాలు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ ముక్కలపై అద్దండి. ఆ తర్వాత సాండ్ విచ్ లాగా మడతపెట్టండి.
* ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, ఓమ, కారం, ధనియాల పొడి, పసుపు వేసి, కొద్దిగా నీరు పోసి పకోడిలకు చేసినట్లుగా పలుచని పిండి బ్యాటర్ ను తయారుచేయండి
* ఒక పాన్ తీసుకొని నూనెను వేడిచేయండి. ఇప్పుడు స్టఫ్ చేసిన బ్రెడ్‌ను పూర్తిగా పిండిలో ముంచి, దీనిని నూనెలో వేగించండి.
* సుమారు 3 నిమిషాలు ఫ్రై చేసి, ఆపై బ్రెడ్ మరోవైపు ఫ్రై చేయండి. అన్ని వైపులా సరిగ్గా ఫ్రై అయిన తర్వాత త్రిభుజాకారంలో కట్ చేసి సర్వ్ చేసుకోండి.
ఛాయ్ తాగుతూ ఈ క్రిస్ప్రీ బ్రెడ్ తింటే ఉంటుందీ.. ఆహా స్వర్గం.
టాపిక్