After delivery food: బాలింతల్లో బలం పెంచే బెల్లం పాయసం, పోషకభరిత ఆహారం
07 October 2024, 6:30 IST
- After delivery food: డెలివరీ తర్వాత మహిళల శరీరం పూర్తిగా బలహీనంగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో బాలింతలకు బెల్లం పాయసం ఎక్కువగా ఇస్తారు. దీని తయారీ ఎలాగో చూడండి.
బెల్లం పాయసం
ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత మహిళ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా శరీరం పూర్తిగా బలహీనపడుతుంది. అందుకే డెలివరీ తర్వాత ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం మంచిది. పోషకాహారం తప్పనిసరి.
కొన్ని చోట్ల బాలింతలకు ఈ బెల్లంతో చేసిన పాయసం తప్పకుండా ఇస్తారు. ఇది బలాన్నిచ్చే ఆహారం అని చెబుతారు. మీ డెలివరీలో ఏమైనా సమస్యలుంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించి ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం లాంటి మినరళ్లుంటాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బెల్లం పాయసం కోసం కావాల్సినవి:
కప్పు సన్నగా తరిగిన మఖానాలు
4 చెంచాల కొబ్బరి తురుము
తరిగిన బాదం పప్పులు
తరిగిన జీడిపప్పు
కర్బూజా గింజలు
బంక లేదా గోంద్ ఖతీరా
ఎండుద్రాక్ష
చిరోంజి
శొంటి పొడి
వాము పొడి
బెల్లం
నెయ్యి
బెల్లం పాయసం తయారీ విధానం
- ముందుగా బాణలిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో గోంద్ కతీరా వేసి వేయించాలి.
- అవి ఉబ్బిపోగానే ఒక పల్లెం లోకి తీసుకోండి.
- అందులోనే జీడిపప్పు, బాదం, వేరుశనగ, చిరోంజి కూడా వేసి వేయించాలి. వాటిని కాస్త వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు కర్బూజా గింజలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- తర్వాత అందులోనే మఖానాను కూడా ముక్కలు చేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించాలి.
- చివరగా కొబ్బరి తురుము కూడా వేయించాలి. అన్నీ ఒక పల్లెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ప్యాన్ లో నీళ్లు పోసుకుని అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిపోయాక వడకట్టుకుని మళ్లీ బాణలిలో వేసి వేడి చేయాలి.
- అందులో కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఇంతకముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలి.
- చివరగా శొంటి పొడి కూడా వేసి తింటే చాలు. బెల్లం పాయసం తయారీ అయినట్లే.