తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Detox Drinks In Winter : ఇవి డిటాక్స్ చేయడానికే కాదు.. జీవక్రియను పెంచడానికి కూడా..

Body Detox Drinks in Winter : ఇవి డిటాక్స్ చేయడానికే కాదు.. జీవక్రియను పెంచడానికి కూడా..

10 November 2022, 7:41 IST

google News
    • Body Detox Drinks in Winter : శీతాకాలంలో మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకుంటూ.. మీ జీవక్రియను పెంచుకోవడం చాలా ముఖ్యం. డిటాక్స్ డ్రింక్స్ అనేవి బరువు తగ్గడానికి.. శరీరాన్ని డిటాక్స్ చేయడానికి మాత్రమే కాదు. అవి మీ మెటబాలీజంను పెంచుతాయి. మరి శీతాకాలంలో ఎలాంటి డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 
డిటాక్స్ డ్రింక్స్
డిటాక్స్ డ్రింక్స్

డిటాక్స్ డ్రింక్స్

Body Detox Drinks in Winter : చలికాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఈ సమయంలోనే లేని పోని రోగాలు అన్ని ఎటాక్ చేస్తాయి. ఫ్లూ, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లిస్ట్ ఉంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన మెటబాలీజం కరెక్ట్​గా ఉండాలి. మనం ఆరోగ్యం బాగుండేందుకు.. చలిని తట్టుకోగలిగే వెచ్చదనం.. మన శరీరం మనకు అందించాలి.

ఎప్పుడైనా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ శరీరాన్ని డిటాక్స్ చేసిన తర్వాతనే ఏ మెడిసన్ అయినా వాడాలి. అప్పుడే వాటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. బ్యూటీ, హెయిర్, ఫ్యాట్ ఇలా చాలా విషయాల్లో ముందు డిటాక్స్ చేయండి. తర్వాత వాటి ఫలితాలు చూడండి. అయితే ఈ శీతాకాలంలో మీ జీవక్రియను బూస్ట్ చేసి.. రుచికరమైన, పోషకాలు అందించే డిటాక్స్ డ్రింక్స్ గురించి.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీఆక్సిడెంట్లతో నిండిన పసుపు టీ

ఒక గిన్నెలో కొన్ని నీటిని వేసి వేడి చేయండి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, 1/4 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి బాగా కలిపి.. మరిగించండి. నీరు సగానికి తగ్గే వరకు మిశ్రమాన్ని ఉడకనివ్వండి. పూర్తయిన తర్వాత పదార్థాలను ఫిల్టర్ చేసి తాగండి. దానిలో కాస్త తేనేను రుచికోసం కలుపి తీసుకోవచ్చు.

ఆరెంజ్-అల్లం-క్యారెట్ రసం

ఈ జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి చలి కాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు చేయాల్సిందల్లా క్యారెట్, నారింజను విడిగా జ్యూస్ చేయండి. వాటిని బ్లెండర్‌లో కలపండి. దానిలో కొద్దిగా పసుపు, అల్లం వేసి.. బ్లెండ్ చేయండి. ఆపై కొద్దిగా నిమ్మరసం పిండి వేయండి. దీనిని వడకట్టి తాగేయండి.

అల్లం, నిమ్మ, తేనె టీ

ఈ తీపి, మసాలా టీ శీతాకాలంలో సాధారణంగా వచ్చే గొంతు నొప్పి, జలుబులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కొన్ని నీటిని వేడి చేయండి. దానిలో సన్నగా తరిగిన అల్లం వేయండి. కొన్ని టీ ఆకులు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మరిగించండి. దాన్ని వడకట్టి వేడిగా తాగేయండి.

దానిమ్మ, బీట్‌రూట్, కలబంద డిటాక్స్ డ్రింక్

బీట్‌రూట్ ఒక గొప్ప క్లెన్సర్. అంతేకాకుండా ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. తాజా కలబంద గుజ్జును తీసుకోండి. విడిగా దానిమ్మ రసాన్ని సేకరించాలి. తరిగిన బీట్‌రూట్‌తో కలిపి బ్లెండర్‌లో వేయాలి. దానిలో అలోవెరా, పెప్పర్ పొడి వేసి బ్లెండ్ చేయండి. వడకట్టి దీనిని తాగేయండి.

బచ్చలికూర, అవకాడో స్మూతీ

ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల సమృద్ధితో నిండిన బచ్చలికూర, అవకాడో స్మూతీ మీరు మీ శరీరానికి అందించే మంచి డిటాక్స్ డ్రింక్. దీనిని బ్లెండర్​లో తీసుకుని.. అందులో కాస్త బాదం పాలు లేదా మీకు నచ్చిన ఏదైనా పాలు కలపండి. తరువాత దానిలో బచ్చలికూర, అవకాడో, ఆపిల్, అరటి వేసి బ్లెండ్ చేయండి. దానిని ఓ గ్లాస్​లో తీసుకుని.. దానిపై నానబెట్టిన చియా సీడ్స్​తో అలంకరించండి.

టాపిక్

తదుపరి వ్యాసం