తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For New Parents: మీ బేబీ హాపీగా ఉండాలంటే ఇలా చేయండి

Tips for new parents: మీ బేబీ హాపీగా ఉండాలంటే ఇలా చేయండి

15 March 2023, 17:31 IST

google News
    • Tips for new parents: మీ బేబీ హాపీగా ఉండాలంటే ఇలా చేయాలంటున్నారు పిల్లల సంరక్షణ నిపుణులు. ఆ టిప్స్ ఏవో మీరు చదవండి.
పేరెంట్ టిప్స్ : బేబీ హాపీగా, హెల్తీగా ఉండాలంటే
పేరెంట్ టిప్స్ : బేబీ హాపీగా, హెల్తీగా ఉండాలంటే (Unsplash)

పేరెంట్ టిప్స్ : బేబీ హాపీగా, హెల్తీగా ఉండాలంటే

తల్లిదండ్రులుగా ఉండడం ఆనందంగా ఉంటుంది. తొలిసారి మీ బేబీని టచ్ చేస్తున్నప్పుడు ప్రేమ, ఆప్యాయతల్లో మునిగిపోతారు. కొత్త పేరెంట్‌గా మీరు మీ చిన్నారికి అన్నీ ఉత్తమమైనవి సమకూర్చాలని అనుకుంటారు. వారికి తగినంత నిద్ర లభించడం నుంచి పోషకాహారం అందించడం వరకూ అన్నీ సవ్యంగా సాగిపోవాలని కోరుకుంటారు. చిన్నారి సంరక్షణ సవాలుతో కూడినదే అయినప్పటికీ మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇస్తుంది. చాలా మంది కొత్త తల్లిదండ్రులు తమ చిన్నారి పట్ల శ్రద్ధ చూపడంలో అనేక అంశాలను ఆసక్తిగా తెలుసుకుంటారు. వారి చుట్టూ ఉచిత సలహాలు బోలెడు వస్తుంటాయి. కానీ వాటిలో ఏది ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ చిన్నారికి ఏది మేలు చేస్తుందో తెలుసుకోవాలి.

బేబీ హైజీన్ ఎక్స్‌పర్ట్, కినూ కోఫౌండర్ నికితా కోహ్లీ కఠూరియా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు. మీ చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే చేయాల్సినవి, చేయకూడనివి వివరించారు.

1. Wash baby laundry separately: బేబీ దుస్తులు విడిగా ఉతకాలి

Dos: చేయాల్సినవి

  1. బేబీ దుస్తుల కోసం ప్రత్యేకంగా తయారైన సున్నితమైన డిటర్జంట్‌తో వాటిని ఉతకాలి. ఇవి కఠినమైన రసాయనాలు లేకుండా ఉంటాయి. రసాయనాలు మీ చిన్నారి మృదువైన చర్మాన్ని చికాకు పరుస్తాయి.
  2. గ్లిజరిన్ ఉండే లిక్విడ్ డిటర్జంట్ వాడడం వల్ల అవి మీ చిన్నారి దుస్తులను సున్నితంగా ఉంచుతాయి. బేబీ చర్మానికి హాని కలగదు.
  3. కుటుంబ సభ్యుల దుస్తులతో కాకుండా, చిన్నారి దుస్తులను విడిగా ఉతకాలి. ఇతరుల దుస్తుల నుంచి క్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

Don'ts: చేయకూడనివి

  1. చిన్నారి దుస్తులు ఉతికేటప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్ వాడకూడదు. అవి చిన్నారి చర్మానికి చికాకు కలిగిస్తాయి.
  2. దుస్తులు ఉతికేటప్పుడు బ్లీచ్ వాడకూడదు. అది కూడా మీ చిన్నారి చర్మాన్ని ఇబ్బంది పెడుతుంది. దుస్తులు కూడా రంగు కోల్పోతాయి.

2. Hydrate the baby's skin after a bath: చర్మాన్ని తేమగా ఉంచండి

Do: చేయాల్సినివి

  1. స్నానం చేయించిన తరువాత చిన్నారి చర్మానికి సున్నితమైన మాయిశ్చరైజర్ పూయండి. చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. పొడిబారకుండా కాపాడుతుంది. తేమగా ఉంటే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  2. స్నానం చేయించిన కొద్ది నిమిషాలకే మాయిశ్చరైజర్ పూయండి. చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.
  3. చిన్నారి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు తల్లిపాలు గానీ, సీసా పాలు గానీ పడుతూ ఉండండి.

Don't: చేయకూడనివి

  1. సువాసనలు, రసాయనాలు ఉండే మాయిశ్చరైజర్లు వాడొద్దు. అవి బేబీ చర్మంపై దద్దుర్లకు కారణమవుతాయి.
  2. అతిగా మాయిశ్చరైజర్ పూయకూడదు. దీని వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి. చర్మ సమస్యలు వస్తాయి.

3. Give your baby a head and scalp massage: మసాజ్

Do: చేయాల్సినవి

  1. చిన్నారి తలపై వలయాకారంలో సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రిలాక్సయేందుకు, అలాగే తలపై భాగంలో రక్త ప్రసరణ మెరుగవడానికి తోడ్పడుతుంది. సున్నితమైన మర్థన చర్మానికి సంరక్షణ ఇవ్వడమే కాకుండా, తల్లీబిడ్డల మధ్య గట్టి బంధం ఏర్పడడానికి దోహదం చేస్తుంది.
  2. తలపై మసాజ్ చేయడానికి తేలికైన బేబీ ఆయిల్ గానీ, కొబ్బరి నూనె గానీ వాడొచ్చు.
  3. తగినంత సమయం ఇస్తూ సున్నితంగా వ్యవహరించండి. చిన్నారి తల చాలా సున్నితంగా ఉంటుందని గుర్తించండి.

Don'ts: చేయకూడనివి

  1. మసాజ్ చేస్తున్నప్పుడు ఒత్తిడి కలిగించకూడదు. దీని వల్ల చిన్నారి అసౌకర్యానికి గురవుతుంది.
  2. ఘాటైన వాసనలు, రసాయనాలు కలిగిన నూనెలు వాడొద్దు.

4. Always carry a baby travel kit: ట్రావెల్ కిట్

Dos: చేయాల్సినివి

  1. మీరు జర్నీ చేస్తున్నట్టయితే మీ వెంట చాలా డైపర్స్, వైప్స్ తీసుకెళ్లండి. అదనంగా కొన్ని జతల దుస్తులు తీసుకెళ్లండి.
  2. బాండేజీ, యాంటీ సెప్టిక్, శిశువుకు సంబంధించిన పెయిన్ రిలీవర్ వంటి వాటితో కూడాన ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లండి.
  3. బేబీ ఆహారం తినగలిగే దశలో ఉంటే తేలికైన ఆహారం తీసుకెళ్లడం మరిచిపోవద్దు.

Don'ts: చేయకూడనివి

  1. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లడం మరిచిపోవద్దు. బేబీ జనన ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ వంటివి వెంట తీసుకెళ్లాలి.
  2. ఎక్కువ సంఖ్యలో బొమ్మలు వెంట తీసుకెళ్లకండి. లేదంటే మీ లగేజీ వాటితోనే నిండిపోతుంది.

తదుపరి వ్యాసం