తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Watermelon For Skin : పుచ్చకాయతో అందం మీ సొంతం.. కానీ ఇలా చేయోద్దు

Watermelon For Skin : పుచ్చకాయతో అందం మీ సొంతం.. కానీ ఇలా చేయోద్దు

HT Telugu Desk HT Telugu

14 April 2023, 13:30 IST

    • Watermelon For Skin : వేసవిలో అధిక నీటి శాతం కలిగిన పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయలు తింటే ఎంతో ఆరోగ్యం. అయితే వీటిని చర్మ అందానికీ ఉపయోగించుకోవచ్చు.
పుచ్చకాయ ప్రయోజనాలు
పుచ్చకాయ ప్రయోజనాలు

పుచ్చకాయ ప్రయోజనాలు

వేసవిలో మీరు పుచ్చకాయను తినవచ్చు. లేదంటే.. మీ చర్మంపై ఫేస్ మాస్క్‌(Face Mask)గా ఉపయోగించవచ్చు. చర్మాన్ని మెరిసేలా చేయడానికి, మొటిమలు తగ్గించేందుకు పుచ్చకాయను ప్రయత్నించండి. పుచ్చకాయ(Watermelon)లో నీరు సమృద్ధిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, మల్టీవిటమిన్లు, మినరల్స్ వంటి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి(Health) అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

మొటిమల కోసం పుచ్చకాయ ఫేస్ ప్యాక్(Watermelon Face Pack) వాడుకోవచ్చు. ఈ పోషకమైన వేసవి పండు చర్మాన్ని అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ రసాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 లేదా 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ చర్మం చికాకు, ఎరుపు నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. అలాగే, ఇది శరీరం యొక్క నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతుంది. గాయం నయం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది.

పుచ్చకాయలో పెరుగు(Curd), తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి పట్టించి, 10-15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని(Face) కడగాలి. తేనె(Honey), పుచ్చకాయలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి. పెరుగు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ, టమోటా గుజ్జు మిశ్రమాన్ని జిడ్డు చర్మం(Oil Skin) ఉన్నవారు ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా(Smooth Skin) మార్చడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలోని మాలిక్ యాసిడ్ మరియు టొమాటోలోని లైకోపీన్ సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేసి చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి.

పుచ్చకాయ రసం(Watermelon Juice), గుజ్జు అరటిపండు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. రిఫ్రిజిరేటర్‌లో పుచ్చకాయ పలుచని ముక్కలను పెట్టి.. తర్వాత తీసి ముఖం మీద 15 నుండి 20 నిమిషాలు అప్లై చేయోచ్చు.

ఇలా చేయోద్దు..

పుచ్చకాయతో నిమ్మ, స్క్రబ్బింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే నిమ్మకాయలో లాక్టిక్ యాసిడ్ మరియు పుచ్చకాయలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండు కలపడం వల్ల మీ చర్మం పొడిగా, ఎరుపుగా మారుతుంది. చాలా సున్నితమైన చర్మం(Skin) ఉన్న మహిళలకు మంచిది కాదు. అలాగే, పుచ్చకాయ ఫేస్ ప్యాక్‌లతో చక్కెర, వాల్‌నట్స్ వంటివి కలపవద్దు. ఏదైనా ఇంటి నివారణను ప్రయత్నించే ముందు, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం లేదా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం