10 Face Packs : మీ అందం కోసం ఇంట్లో తయారు చేసే 10 ఫేస్ ప్యాక్‌లు
10 Face Packs : జిడ్డు, మెుటిమలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు. ఇంట్లోనే తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు కొన్ని ఉన్నాయి. సహజమైన పదార్థాలతో చేసుకోవచ్చు.
ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్(Face Pack)లు సహజ పదార్థాల మిశ్రమాలు. ఇవి వివిధ ప్రయోజనాల కోసం ముఖంపై అప్లై చేసుకోవడానికి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని(Skin) తెచ్చుకోవచ్చు. ఇవి సహజమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి సులభంగా లభించే సహజ పదార్ధాల నుండి తయారవుతాయి. చర్మానికి హాని కలిగించే కఠినమైన రసాయనాలు(Chemicals) ఉండవు.
ట్రెండింగ్ వార్తలు
1. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్‌తో కలపండి. ముఖం మీద అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలానే ఉంచుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను గ్రహించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
2. వేప, పసుపు ఫేస్ ప్యాక్ :
ఒక పిడికెడు వేప ఆకులను గ్రైండ్ చేసి, 1/2 టీస్పూన్ పసుపు పొడి, తగినంత నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. ముఖం మీద రాసుకుని 15-20 నిమిషాలు ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరచడానికి, డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.
3. నిమ్మ, తేనె ఫేస్ ప్యాక్ :
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. ముఖం మీద పెట్టుకోవాలి. 15-20 నిమిషాలు వదిలివేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ ను తొలగించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. యాపిల్ సైడర్ వెనిగర్, క్లే ఫేస్ ప్యాక్ :
1 టేబుల్ స్పూన్ క్లే పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, తగినంత నీళ్లతో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ముఖం మీద అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు వదిలివేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ రాకుండా చేస్తుంది.
5. బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్ :
1/2 పండిన బొప్పాయిని మెత్తగా చేసి, 1 టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ముఖం మీద అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాలు అలానే పెట్టుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.
6. దోసకాయ, పెరుగు ఫేస్ ప్యాక్ :
1/2 దోసకాయలను 2 టేబుల్ స్పూన్ల సాదా పెరుగుతో కలపండి. ముఖం మీద అప్లై చేసి.., 15-20 నిమిషాలు వదిలివేయండి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
7. టీ ట్రీ ఆయిల్, అలోవెరా ఫేస్ ప్యాక్ :
2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపాలి. ముఖం మీద అప్లై చేసుకుని, 10-15 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
8. ఎగ్ వైట్, లెమన్ ఫేస్ ప్యాక్ :
1 గుడ్డులోని తెల్లసొనను 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలపండి. బాగా కలుపుకోవాలి. ముఖం మీద అప్లై చేసి.. 15-20 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ రంధ్రాలను బిగుతుగా చేసి ఆయిల్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
9. గంధం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ :
2 టేబుల్ స్పూన్ల గంధపు పొడిని తగినంత రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ముఖం మీద పెట్టుకోవాలి. 15-20 నిమిషాలు ఉంచాలి. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డును తగ్గించి, మొటిమల బారిన పడే చర్మాన్ని ఉపశమనం చేస్తుంది.
10. పుదీనా, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ :
కొన్ని తాజా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, తగినంత నీటితో కలిపి పేస్ట్ లా చేయాలి. ముఖం మీద అప్లై చేసి, 15-20 నిమిషాలు వదిలివేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖం మీద ఆయిల్ ను నియంత్రించడంలో, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా చేస్తాయి. చర్మ సంరక్షణకు సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం. అయినప్పటికీ ఏదైనా కొత్త పదార్థాలను ముఖంపై ఉపయోగిస్తే కొంతమందికి పడదు. అలెర్జీ వచ్చేవారు వైద్యుడిని సంప్రందించాలి.