తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idly Chutney: ఇడ్లీ, దోశెల్లోకి ఏం చట్నీలు చేయాలో అర్థం కావడం లేదా? ఈ ఆరు రకాల పచ్చళ్లు ప్రయత్నించండి

Idly Chutney: ఇడ్లీ, దోశెల్లోకి ఏం చట్నీలు చేయాలో అర్థం కావడం లేదా? ఈ ఆరు రకాల పచ్చళ్లు ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu

25 October 2024, 8:30 IST

google News
    • Idly Chutney:  ఇడ్లీ, దోశెల్లోకి ఎలాంటి చట్నీలు చేయాలో అర్థం కావడం లేదా? ఇక్కడ మేము ఆరు రుచికరమైన చట్నీల ఐడియాలు ఇచ్చాము. ఇది దోశెల్లోకి, ఇడ్లీల్లోకి కూడా టేస్టీగా ఉంటాయి. 
ఆరు రకాల బ్రేక్ ఫాస్ట్ చట్నీలు
ఆరు రకాల బ్రేక్ ఫాస్ట్ చట్నీలు (PC: Freepik)

ఆరు రకాల బ్రేక్ ఫాస్ట్ చట్నీలు

భారతదేశంలోని ప్రతి ప్రాంతం వైవిధ్యభరితమైన ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ వంటకాల్లో రెండు శైలులు ఉన్నాయి. ఒకటి ఉత్తర భారత వంట శైలి, మరొకటి దక్షిణ భారత వంట శైలి. రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. దక్షిణ భారతదేశంలోదోశ , ఇడ్లీ ఎంతో ఫేమస్. వీటిని తినాలంటే కచ్చితంగా పక్కన చట్నీ ఉండాల్సిందే. ఈ చట్నీలు వాటి రుచిని రెట్టింపు చేస్తాయి.

కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, టమోటా పచ్చడి, చింతపండు పచ్చడి, వేరుశనగ పచ్చడి… ఇవన్నీ కూడా ఇడ్లీ,దోశెతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

దోశ, ఇడ్లీలకు బెస్ట్ కాంబినేషన్ చట్నీలు

కొబ్బరి పచ్చడి: తాజా కొబ్బరి, వేయించిన వేరుశెనగలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, నీళ్లను మిక్సీలో జార్లో వేసి రుబ్బుకోవాలి. దీనికి నూనెలో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టాలి. గుప్పెడు కరివేపాకులు వేస్తే రుచి రెట్టింపు అవుతుంది. దీన్ని దోశెతో తింటే రుచి అదిరిపోతుంది.

కొబ్బరి-కొత్తిమీర పచ్చడి: తురిమిన తాజా కొబ్బరికి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి గట్టిగానే ఉంచాలి. నూనెలో ఆవాలు, మినప్పప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు వేయించి తాళిాంపు వేయాలి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీల్లోకి రుచికరంగా ఉంటాయి.

వేరుశెనగ పచ్చడి: కొబ్బరి లేకుండా సులభంగా తయారుచేసే సూపర్ చట్నీ ఇది. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఒక ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, కొద్దిగా జీలకర్ర, ఒక చెంచా కందిపప్పు, 2-3 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే ఒక కప్పు వేయించిన వేరుశనగ పలుకులు, ఉసిరికాయ సైజులో చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి తాళింపు పెట్టుకోవాలి.

చింతపండు పచ్చడి: ఒక కప్పు చింతపండును వేడినీటిలో అరగంట నానబెట్టి ఈ పచ్చడి తయారుచేసుకోవాలి. ఆ తర్వాత దాని రసాన్ని తీసుకోవాలి. ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. అందులో చింతపండు రసం కలపాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ అజ్వైన్ పౌడర్, ఉప్పు వేసి మీడియం మంటపై 10 నుంచి 12 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత గాలి చొరబడని పాత్రలో నిల్వ ఉంచాలి. పకోడీలకు బెస్ట్ కాంబినేషన్ అయిన ఈ పుల్లని-స్పైసీ-స్వీట్ చట్నీ దోశ కూడా ఇడ్లీలకు బెస్ట్ కాంబినేషన్.

టొమాటో పచ్చడి: సాధారణంగా జొన్న, రాగి రోటీ రుచి కోసం ఉపయోగించే ఈ పచ్చడిని టమోటాలతో తయారుచేస్తారు. ఈ పచ్చడితో దోశ, ఇడ్లీ రుచి చూడటానికి చాలా బాగుంటుంది. ఈ చట్నీ తయారు చేయడానికి రెండు టమోటాలు, ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీ అయిదు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి రుబ్బుకోవాలి. వేయించిన వేరుశనగ గింజలు, కొద్దిగా బెల్లం, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి తాళింపు పెట్టుకోవాలి.

టొమాటో-ఉల్లిపాయ పచ్చడి: ఇడ్లీ, దోశ రుచి కోసం కొత్త రుచి కోసం చూస్తున్నట్లైతే ఈ పచ్చడి సరిపోతుంది. పాన్ లో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక ఒక టీస్పూన్ మినప్పప్పు, కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 లవంగం, 1 తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.. తర్వాత అందులో తరిగిన టొమాటోలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. రుచికి సరిపడా 1 టీస్పూన్ బెల్లం, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరినూనె, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, చిటికెడు అల్లం, కరివేపాకు వేసి కలపాలి. రుచికరమైన ఉల్లిపాయ-టమోటా పచ్చడి రుచికి సిద్ధంగా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం