తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking And Acidity | తిన్న తర్వాత నడిస్తే ఎసిడిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? తెలుసుకోండి!

Walking and Acidity | తిన్న తర్వాత నడిస్తే ఎసిడిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

30 May 2023, 8:49 IST

    • Walking Reduce Acidity: ఎసిడిటీగా ఉంటే కాసేపు నడవాలంటున్నారు నిపుణులు, నడక జీర్ణ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఇక్కడ తెలుస్తుంది.
Walking Reduce Acidity:
Walking Reduce Acidity: (istock)

Walking Reduce Acidity:

Walking Reduce Acidity: కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల తలెత్తే పరిస్థితి. ఈ ఆమ్లం కడుపులోని గ్రంధుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సంకేతాలు వస్తాయి. ఎసిడిటీ చాలా సాధారణమైన సమస్య. ఎసిడిటీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు, అయితే ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత, ఫుడ్ రియాక్టివిటీ కారణంగా, అజీర్ణం కారణంగా, మలబద్ధకం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధుల కారణంగా కూడా కడుపులో మంటగా అనిపించవచ్చు.

ఎసిడిటీ నుంచి ఉపశమనం కోసం చాలా సార్లు ఏదైనా ఔషధం తీసుకోవడం, సిరప్ తాగడం లేదా హోమ్ రెమెడీస్ ప్రయత్నిస్తారు. అయితే ఇవేవీ అవసరం లేకుండా కూడా ఎసిడిటీని తగ్గించుకోవచ్చట. అందుకు ఒక సింపుల్ చిట్కా ఉంది, అదేమిటీ అంటే మీరు ఎసిడిటీ నుంచి ఇబ్బందిపడుతున్నపుడు అక్కడ్నించి లేచి కాసేపు నడిస్తే చాలని నిపుణులు అంటున్నారు. ఇలా నడవడం వలన కూడా ఎసిడిటీ తగ్గిపోతుంది.

ఎందుకంటే.. నడకను కార్డియో వ్యాయామంగా పరిగణిస్తారు. ఈ వ్యాయామం మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది, మీ కడుపు, దాని దిగువ భాగాలపై ఒత్తిడి తెస్తుంది. ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది. మీ జీర్ణక్రియ, జీర్ణక్రియ ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. దీని కారణంగా, ఆహారం వేగంగా జీర్ణం కావడం మొదలవుతుంది తద్వారా యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది, ఎసిడిటీ సమస్య అనేదే ఉండదు.నడకతో జీర్ణవ్యవస్థకు కలిగే మరిన్ని ప్రయోజనాలు చూడండి.

జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది

మీ ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే, అది ఎసిడిటీ సమస్య అని మీరు అర్థం చేసుకోవాలి. జీవక్రియ నెమ్మదించినపుడు ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ జీవక్రియ రేటు వేగం పెంచుకోవాలి, అందుకు నడక మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

అజీర్ణం నుండి ఉపశమనం

పుల్లని త్రేనుపును వదిలించుకోవడానికి నడక ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నడిచేటప్పుడు, మీ ఆహారనాళం నుండి వచ్చే పుల్లని పుల్లని తిరిగి కడుపులోకే వెళ్లిపోతాయి. అక్కడ కడుపు లైనింగ్ ఆ తేన్పులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది, ఇలా నడక అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తుంది

కొవ్వు పదార్ధాలు చేసే నష్టం తగ్గుతుంది

అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు తినడం వలన మీ ఆరోగ్యాని చాలా చెడు జరుగుతుంది. కొవ్వులు అంత తేలికగా జీర్ణం కావు, కాబట్టి ఎసిడిటీ, అజీర్ణం కూడా ఉంటాయి. మీరు మాంసం, కొవ్వు పదార్థాలు తిన్న తర్వాత కాసేపు, నడవండి. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

అందుకే తిన్న తర్వాత కాసేపు నడవండి అని పెద్దలు చెబుతుంటారు. తిన్నవెంటనే పడుకోవడం మంచి అలవాటు కాదు, కాసేపు కూర్చొని నడవడం మంచి అలవాటు అవుతుంది.