Sleep and Banana: రాత్రిపూట అరటి పండు తింటే నిద్రా బాగా పడుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
29 August 2024, 20:14 IST
- Sleep and Banana: అరటిపండ్లలో ఉండే పోషకాలు ఎక్కువ. ఆ పండును తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ రాత్రి పూట కొంతమంది తింటూ ఉంటారు. అలా తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
అరటి పండు నిద్రలేమిని తగ్గిస్తుందా?
అరటిపండ్లను చాలా సంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. కొంతమంది వీటిని నిద్రవేళలో తింటూ ఉంటారు. అలా తినడం వల్ల చక్కగా నిద్రపడుతుందని ఎంతో మంది నమ్మకం. ఇది నిద్రా నాణ్యతను పెంచుతుందని అంటారు. వాస్తవానికి మీ నిద్రకు అరటి పండు ఏవిధంగానూ సహకరించదు. ఇటీవల చేసిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది.
అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 నిండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే, ఒక అరటిపండు మన శరీరానికి కావాల్సిన పరిమాణంలో మాత్రం పైన చెప్పిన పోషకాలను అందించదు. ఉదాహరణకు, అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కానీ ఒక అరటి పండు మన శరీరానికి కావాల్సిన పొటాషియంలో పదిశాతం మాత్రమే అందించగలదు.
అరటిపండులోని పోషక పదార్ధాలు
అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 కంటెంట్ కోసమే వీటిని అధికంగా తింటూ ఉంటారు. ఈ పండ్లు రాత్రి భోజనం తరువాత తినడం వల్ల నిద్ర బాగా పడుతుందన్న నమ్మకంతో ఎంతో మంది తింటూ ఉంటారు. ఇది ఒక అపోహ మాత్రమేనని అధ్యయనం చెప్పేసింది.
మెగ్నీషియం మనకు ప్రశాంతంగా అనిపించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. అయితే అరటిపండ్లలో 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ మెగ్నీషియం ఉంటుంది. అయితే శరీరానికి రోజువారీ అవసరం తీరాలంటే 400 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉండాలి. అందువల్ల మనం తినే ఆహారంలో మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి.
విటమిన్ బి6 మానసిక స్థితి నియంత్రణకు, సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బి6 రోజువారీ అవసరం 1.3 మిల్లీగ్రాములు. అయితే ఒక అరటిపండులో 0.4 మిల్లీగ్రాములు ఉంటుంది. విటమిన్ బి6 వల్ల నిద్ర బాగా పడుతుంది. అరటిపండ్లు కొంతమేరకు మాత్రమే విటమిన్ బి6ను అందిస్తాయి. ఈ పోషకం కోసం ఇతర పదార్థాలు కూడా తినాలి.
అరటిపండు నిద్రపోవడానికి సహాయపడుతుందా?
అరటిపండ్లలో పోషకాలు ఎక్కువే. రోజుకో అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే రాత్రి పడుకోబోయే ముందు తినడం ప్రత్యేకంగా ఎలాంటి లాభాలు రావు. రాత్రి పూట కన్నా ఉదయం పూటే అరటిపండును తినడం ముఖ్యం. రాత్రి పూట తింటే శ్లేష్మం ఉత్పత్తి అయి, జలుబు చేస్తుంది. అదే బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే మాత్రం ఎంతో మేలు కలుగుతుంది. అయితే మీకు డయాబెటిస్ సమస్య ఉంటే అరటి పండును అధికంగా తినకూడదు. అరటి పండు రక్తంలో చక్కెర సమస్యను అమాంతం పెంచేస్తుంది. కాబట్టి మధుమేహులు జాగ్రత్తగా ఉండాలి.
టాపిక్