Coffee: ప్రతిరోజూ కప్పు కాఫీ తాగితే మీ ఆయుష్షు పెరుగుతుందా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
12 December 2024, 7:00 IST
- Coffee: ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ ఒక మినషి ఆయుష్షును పెంచే అవకాశం ఉందని కొత్త స్టడీ తేల్చి చెప్పింది.
కాఫీతో ఉపయోగాలు
ఉదయం లేవగానే టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తారు. ఎక్కువ మంది టీని తాగేందుకే ఇష్టపడతారు. అయితే టీ కన్నా కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల ఆయుష్షుని పెంచుకోవచ్చని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఆరోగ్యకరమైన, సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి రోజు కప్పు కాఫీ చాలని ఆ అధ్యయనం చెబుతోంది. పోర్చుగల్ లోని కోయింబ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బృందం ఇటీవల చేసిన అధ్యయనం ఈ విషయం తేలింది.
కాఫీతో ఆయుష్షు
పరిశోధకులు ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియాలకు చెందిన ప్రజలను కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. వారిలో కాఫీ తాగని వారు, తాగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఇంతకుముందు చేసిన 85 అధ్యయనాలను కూడా పరిశీలించారు. ఇప్పటి అధ్యయనం, పాత అధ్యయనాలను పరిశీలించాక రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగేవారికి 1.84 సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనం కనుగొంది.
తాగే కాఫీ రకాలు, జనాభా మరియు అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల అంశాలలో ఫలితాలు మారుతూ ఉంటాయి. అందువల్ల, ప్రయోజనాలు కేవలం కాఫీ తాగడం వల్ల మాత్రమే కాదు. అయితే, అధ్యయనం యొక్క వెడల్పు దాని బలం. ఇన్ఫ్లమేషన్, మెటబాలిజం వంటి ఆరోగ్య సూచికలను విశ్లేషించారు. కాఫీ సేవించడం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడానికి ధూమపానం మరియు మద్యపానం కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి |
పరిశోధకులు తమ అధ్యయనాన్ని ఆరోగ్య జర్నల్ లో ప్రచురించారు. క్రమం తప్పకుండా కాఫీని తాగడం వల్ల కండరాలు, హృదయం, మానసిక, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మంచి మెరుగుదల ఉంటుందని కనిపెట్టారు. హృదయ, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటిస్, చిత్తవైకల్యం, డిప్రెషన్, బలహీనత వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది.
కాఫీలో ఉండే కెఫిన్ ఆరోగ్యకరమైన ఆయుర్దాయాన్ని ఇస్తుందని చెప్పలేకపోయినా సానుకూల ఆరోగ్య ప్రభావాలను మాత్రం కలిగిస్తుంది. అలాగే ఇది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా కాఫీ తగ్గిస్తాయి.
కాఫీని మితంగా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇది ముందుంటుంది. మానసిక స్థితి మూడీగా ఉన్నప్పుడు కాఫీ తాగి చూడండి ఉత్సాహం వస్తుంది. అయితే దీన్ని అధికంగా తాగితే మాత్రం అనర్థాలు జరుగుతాయి. రోజుకు రెండు కప్పుల కాఫీతో ఆపేయడమే మంచిది.
గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు రోజుకు ఒకటి రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)