తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Guava Leaves Toothpaste । దంతాల కోసం జామ ఆకు పేస్ట్ వాడండి, ప్రయోజనాలు ఇవే!

DIY Guava Leaves Toothpaste । దంతాల కోసం జామ ఆకు పేస్ట్ వాడండి, ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

09 May 2023, 8:09 IST

google News
    • DIY Paste for Teeth: దంతాల సంరక్షణ కోసం మీరు జామ ఆకు పేస్టును ఉపయోగించవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
DIY Paste for Teeth
DIY Paste for Teeth (Unsplash)

DIY Paste for Teeth

Toothache Home Remedies: పంటినొప్పి ఎప్పుడైనా, ఏ వయసు వారినైనా వేధించే సమస్య. పంటి కింద నొప్పిని దాచిపెట్టుకొని నోరు తెరలేము, మాట్లాడలేము. ఆహారం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఉదయం లేవడం దగ్గర్నించీ పంటినొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారా? ఏదైనా తక్షణ హోమ్ రెమెడీ కోసం చూస్తున్నారా? అయితే జామ ఆకులను (Guava leaves for Toothache) ప్రయత్నించి చూడండి.

పంటి నొప్పికి జామ ఆకులను ఈరోజు కాదు, ఏళ్ల తరబడి వాడుతున్నారు. ఈ ఆకులు దంత క్షయాన్ని (Tooth Decay) తగ్గించడం, మంటను తొలగించడం, దంతాలను ఆరోగ్యంగా ఉంచడం వంటి ఔషధ గుణాలను ప్రదర్శిస్తాయి. ఈ ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి దంతాలలోని బ్యాక్టీరియాను చంపడంలో, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరి దంతాల కోసం జామ ఆకులను ఎలా ఉపయోగించాలి , వాటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దంతాల కోసం, మీరు జామ ఆకులతో తయారు చేసిన పేస్ట్ ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ తయారీకోసం కావాలసినవి:

DIY Guava Leaves Toothpaste

  • కొన్ని తాజా జామ ఆకులు
  • కొన్ని లాంగ్ పెప్పర్ లేదా పిప్లి
  • కొన్ని లవంగాలు
  • కొద్దిగా ఉప్పు

దంత సంరక్షణ- జామ ఆకు పేస్ట్ తయారీ విధానం

ఇప్పుడు వీటన్నింటినీ కలిపి గ్రైండ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముతకగా రుబ్బుకోవాలి. ఈ ముతక పేస్ట్ ను మీ దంతాలకు అప్లై చేయండి. దంతాలకు జామ ఆకుల పేస్టును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

యాంటీ బాక్టీరియల్

మీరు పంటి నొప్పులను వదిలించుకోవడానికి ఈ యాంటీ బాక్టీరియల్ పేస్ట్ ఉపయోగించవచ్చు. లేదా ఈ ఆకుల సారంను ఉపయోగించవచ్చు. దంతాల లోపల ఉండే హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడంతో పాటు, దంతాలపై పేరుకు పోయిన మురికి, క్రిములను కూడా ఇది నిర్వీర్యం చేస్తుంది. ఈ విధంగా, ఇది పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

జామ ఆకు అయినా, పిప్లి అయినా, రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. దంతాల చుట్టుపక్కల ప్రాంతంలో సంక్రమణను కూడా తగ్గిస్తుంది, దీని కారణంగా దంతాల నొప్పి తగ్గుతుంది. కాబట్టి, ఈ హోం రెమెడీని మీకు పంటి నొప్పి ఉన్నప్పుడు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం