Toothache Home Remedies । పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం.. ఈ 5 చిట్కాలు పాటించండి!
Toothache Home Remedies: పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇంటి నుంచే నయం చేసుకోవచ్చు, ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి చూడండి.
National Toothache Day 2023: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9న పంటి నొప్పి దినోత్సవంగా గుర్తిస్తారు. దంత సమస్యలకు సంబంధించిన కారణాలపై అవగాహన కల్పించడం, పంటి నొప్పిని దూరం చేసేందుకు సమర్థవంతమైన మార్గాలను సూచించడం, ఆనందకరమైన చిరునవ్వును అందించడం ఈరోజుకు ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
సాధారణంగా పంటినొప్పికి దంతాలలో కావిటీస్ లేదా చిగుళ్ల వ్యాధి కారణం అయి ఉంటుంది. ఈ పంటి నొప్పి ఉన్నప్పుడు మీ దంతాలు, దవడలలో లేదా దాని చుట్టూ తేలికపాటి నుండి తీవ్రమైన నొప్పి ఉంటుంది. పంటినొప్పి తీవ్రంగా బాధించే సమస్య, మాట్లాడాలన్నా, ఏదైనా తినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.
Toothache Home Remedies- పంటి నొప్పి తగ్గించడానికి చిట్కాలు
సాధారణ పంటి నొప్పిని కొన్ని ఇంటి చిట్కాలతో నివారించవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. ఉప్పు నీటిని పుక్కిలించడం
పంటినొప్పి ఉన్నప్పుడు ఉప్పునీటితో నోటిని శుభ్రపరచడం అనేది మొదటి, ప్రభావవంతమైన చికిత్స. ఉప్పునీరు ఒక సహజ క్రిమిసంహారకం, ఇది మీ దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలు, మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.
ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం, ట్రస్టెడ్ సోర్స్ చికిత్స చేయడం వల్ల పంటి నొప్పి, మంటను తగ్గించడంతో పాటు నోటి గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.
2. హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగం
హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కూడా నోటిని శుభ్రం చేయడానికి, నొప్పి, వాపుల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ బాక్టీరియాను చంపడంతో పాటు, దంత ఫలకాన్ని తగ్గిస్తుంది, చిగుళ్ళలో రక్తస్రావాన్ని నయం చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో సమాన పరిమాణంలో నీరు కలపండి, ఆపై దానిని మౌత్ వాష్‌గా ఉపయోగించండి. అయితే ఈ ద్రావణాన్ని మింగవద్దు.
3. వెల్లుల్లి
వేల సంవత్సరాలుగా వెల్లుల్లిని ఒక ఆహార పదార్థంగానే కాకుండా, ఒక ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. దంత ఫలకాన్ని కలిగించే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా, నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది. పంటి నొప్పికి వెల్లుల్లిని వాడాలంటే, ఒక వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి పేస్ట్‌లా తయారు చేసి, నొప్పి ప్రభావం ఉన్న చోట అప్లై చేయండి. ఇందులో మీరు కొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు. లేదా తాజా వెల్లుల్లి రెబ్బలను నెమ్మదిగా నమలడం ద్వారా పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. లవంగం
లవంగం పంటి నొప్పికి సంబంధించిన ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. లవంగం నూనె పంటి నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది, మంటను చల్లబరుస్తుంది. లవంగంలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది సహజమైన క్రిమినాశకంగా పనిచేస్తుంది.
అయితే లవంగ నూనె నేరుగా అప్లై చేస్తే మంట కలగవచ్చు. దీనిలో కొద్దిగా పొద్దుతిరుగుడు లేదా జోజోబా నూనె వంటి క్యారియర్ ఆయిల్‌ను కలపాలి. 30 మిలీ నూనెలో 15 15 చుక్కల లవంగం నూనెను కలిపి ఆ నూనెను ఉపయోగించండి. కాటన్ బాల్‌ను ఈ నూనెలో ముంచి నొప్పి ఉన్నచోట రోజుకు కొన్ని సార్లు వర్తించండి. లేదా ఒక చిన్న గ్లాసు నీటిలో ఒక చుక్క లవంగం నూనె వేసి మౌత్ వాష్ కూడా చేసుకోవచ్చు
5. జామ ఆకులు
జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. నోటి సంరక్షణలో సహాయపడే యాంటీమైక్రోబయాల్ ట్రస్టెడ్ సోర్స్ యాక్టివిటీని కూడా జామ ఆకులు కలిగి ఉన్నాయి. పంటి నొప్పి ఉన్నప్పుడు నేరుగా తాజా జామ ఆకులను నమలవచ్చు లేదా మెత్తగా తరిగిన జామ ఆకులను వేడినీటిలో వేసి మౌత్ వాష్ చేసి ఉపయోగించవచ్చు.
పుదీనా సారం వర్తించడం, కోల్డ్ ప్రెస్ విధానాలు కూడా పంటి నొప్పిని శాంతపరుస్తాయి.
సాధారణ పంటినొప్పికి పైన పేర్కొన్న చిట్కాలు ప్రభావం చూపుతాయి. అయితే మీకు పంటి నొప్పి తీవ్రంగా ఉంటే, మీ లక్షణాలురెండు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వెంటనే దంత వైద్యుడిని సంప్రదించండి. అలాగే మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లేదా తల్లిపాలు అందిస్తున్నట్లయితే వైద్యులతో మాట్లాడి ఔషధాలలో మార్పులు చేసుకోవాలి.
సంబంధిత కథనం