DIY Corn Flour Face Packs । మొటిమలు లేని మొఖం కోసం మొక్కజొన్న పిండితో ఫేస్ ప్యాక్‌లు!
20 May 2023, 13:41 IST
- DIY Corn Flour Face Packs: మీ చర్మ సంరక్షణ దినచర్యలో కార్న్‌ఫ్లోర్‌ను ఎలా ఉపయోగించాలి? కార్న్‌ఫ్లోర్‌తో ఇంట్లోనే చేసుకోగల DIY ఫేస్ ప్యాక్‌ల (DIY Corn Flour Face Packs) గురించి ఇక్కడ చూడండి.
DIY Corn Flour Face Packs:
Skin Care at Home: మొక్కజొన్న పిండి లేదా కార్న్‌ఫ్లోర్‌ను వివిధ వంటకాలలో కొద్దిగా క్రిస్పీనెస్ కోసం, ఆకృతిని తీసుకురావటం కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ పిండిని కేవలం వంటకాల కోసం మాత్రమే కాదు, సౌందర్య పోషణలో కూడా దీని పాత్ర ఉందని గుర్తించారు. కార్న్‌ఫ్లోర్‌లో మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉండే ప్రోటీన్లు, స్టార్చ్, కొవ్వులు ఉన్నాయి. మొక్కజొన్నలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు మీ చర్మానికి ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవి మీ చర్మాన్ని సున్నితంగా మార్చడం, ముఖం కాంతివంతం చేయడం, మృతకణాలను తొలగించడం మొదలైన సౌందర్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
మీ చర్మ సంరక్షణ దినచర్యలో కార్న్‌ఫ్లోర్‌ను ఎలా ఉపయోగించాలి? కార్న్‌ఫ్లోర్‌తో ఇంట్లోనే చేసుకోగల DIY ఫేస్ ప్యాక్‌ల (DIY Corn Flour Face Packs) గురించి ఇక్కడ చూడండి.
DIY Lemon Turmeric Corn flour Face Mask
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ చర్మాన్ని UV-ప్రేరిత ఫోటోడ్యామేజ్ నుండి రక్షించడం, కొల్లాజెన్ సంశ్లేషణ చేసి చర్మాన్ని ఆరోగ్యంగా చేయడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మెరిసేలా మార్చడంలో సహాయపడతాయి
కావలసినవి
- 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం,
- పసుపు 1 టీస్పూన్
- కొన్ని చుక్కల రోజ్ వాటర్
- ఒక చిన్న మిక్సింగ్ గిన్నెలో, అన్ని పదార్థాలను కలపండి. మృదువైన పేస్ట్ తయారు చేయండి.
నిమ్మ- పసుపు- కార్న్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ అప్లికేషన్
ఈ ఫేస్ మాస్క్ వేసుకునే ముందుగా మీ ముఖాన్ని నీళ్లతో కడుక్కోండి. ఆపై పేస్ట్‌ను మీ ముఖంపై సమానంగా వర్తించండి. సుమారు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆరిన తర్వాత, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి, మృదువైన టవల్‌తో తుడిచి, ముఖానికి సున్నితమైన మాయిశ్చరైజర్‌ను వర్తించండి.
DIY Oats Coconut oil Corn flour Face Mask
కార్న్‌ఫ్లోర్‌లో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కణాల వృద్ధిని పెంచుతుంది. చర్మం మెరుస్తూ, పునరుజ్జీవింపజేయడానికి సహకరిస్తుంది ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. ఇంకా UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనె మీ చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది.
కావలసినవి
- మొక్కజొన్న 1 టేబుల్ స్పూన్
- ఓట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు
- ఒక పెద్ద గిన్నెలో అన్ని అన్ని పదార్థాలను సరిగ్గా కలపండి. మంచి పేస్ట్ లాగా తయారు చేయండి.
ఓట్స్ పౌడర్, కొబ్బరి నూనె- కార్న్‌ఫ్లోర్ ఫేస్ ప్యాక్ అప్లికేషన్
ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖంపై అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పూర్తిగా ఆరిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి, మెత్తటి టవల్‌తో తుడవండి. ఉత్తమ ఫలితాల కోసం ఫేస్ ప్యాక్ కడిగేసుకున్నాక సున్నితమైన మాయిశ్చరైజర్‌ను ముఖానికి వర్తించండి.
DIY Rice powder, Milk Corn flour Face Mask
జిడ్డుగల చర్మం ఉన్న వారికి ఈ ఫేస్ మాస్క్ అద్భుత ఫలితాలను అందిస్తుంది. బియ్యం పొడి చర్మంపై దద్దుర్లు, వాపును తొలగిస్తుంది, పాలు మృదువైన చర్మాన్ని అందిస్తాయి. మొక్కజొన్న పిండి మీ ముఖం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది
కావలసినవి
- బియ్యం పొడి 2 టేబుల్ స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు
- పాలు 3 టేబుల్ స్పూన్లు
- ఒక పెద్ద గిన్నెలో, మూడు పదార్థాలను కలపండి. మీరు మృదువైన, సిల్కీ పేస్ట్ రూపొందించే వరకు కలుపుతూనే ఉండండి.
రైస్ పౌడర్, పాలు- కార్న్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ అప్లికేషన్
ముందుగా మీ ముఖాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను వేయడం ప్రారంభించండి. ముఖం మీద అప్లై చేసిన తర్వాత, దానిని సహజంగా ఆరనివ్వండి. ఆఅ తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.