తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ajwain: వామును చలికాలంలో ఇలా తీసుకోండి.. జలుబు, దగ్గుపై పోరాడేందుకు తోడ్పడుతుంది

Ajwain: వామును చలికాలంలో ఇలా తీసుకోండి.. జలుబు, దగ్గుపై పోరాడేందుకు తోడ్పడుతుంది

11 November 2024, 10:30 IST

google News
    • Ajwain: వాము వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జలుబు, దగ్గు తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చలికాలంలో వామును ఎలా తీసుకుంటే ప్రభావంతంగా పని చేస్తుందో ఇక్కడ చూడండి.
Ajwain: వామును చలికాలంలో ఇలా తీసుకోండి.. జలుబు, దగ్గుపై పోరాడేందుకు తోడ్పడుతుంది
Ajwain: వామును చలికాలంలో ఇలా తీసుకోండి.. జలుబు, దగ్గుపై పోరాడేందుకు తోడ్పడుతుంది

Ajwain: వామును చలికాలంలో ఇలా తీసుకోండి.. జలుబు, దగ్గుపై పోరాడేందుకు తోడ్పడుతుంది

వాములో ఔషద గుణాలు మెండుగా ఉంటాయి. దాదాపు అందరి వంటిట్లో ఇది ఉంటుంది. ఇది వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. యాంటీఇన్‍ఫ్లమేటర్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలను వాము కలిగి ఉంటుంది. దీనికి చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించే శక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. వాటి నుంచి కూడా వాము ఉపశమనం కలిగించగలదు. దీన్ని ఎన్ని రకాలు తీసుకోవచ్చంటే..

వాము టీ

వాము గింజలతో టీ చేసుకొని ప్రతీ రోజు తాగొచ్చు. ఇందుకోసం ముందుగా.. ఓ కప్ నీటిలో టేబుల్ స్పూన్ వాము వేసుకొని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత దించుకొని ఆ నీటిని వడగట్టుకోవాలి. రుచికోసం ఆ వాము టీలో తేనె లేదా నిమ్మరసాన్ని వేసుకోవచ్చు. వాము, అల్లం కలిపి నీటిలో మరిగించుకొని కూడా టీలా చేసుకోవచ్చు.

బెల్లంతో కలిపి..

వాము నేరుగా కూడా నమలవచ్చు. వామును పొడిగా చేసి.. బెల్లంతో కలిపి కూడా తినవచ్చు. బెల్లంతో వాము తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తుంది. జలుబు, దగ్గును నివారించేందుకు ఉపయోగపడుతుంది. అల్లం పొడితో కలిపి కూడా వామును తినొచ్చు.

తులసితో వాము

తులసి ఆకులతో వాము నీటిని తయారు చేసుకున్నా చాలా మేలు. ముందుగా వేయించుకున్న ఓ టీ స్పూన్ వామును రాత్రంతా ఓ గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టాలి. ఆ నీటిలో 5 తులసి ఆకులను వేసి మరింగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని వడగట్టి తాగేయాలి. లేకపోతే వాము, తులసి ఆకులను నేరుగా నీటిలో వేసి కూడా మరిగించుకొని వడగట్టుకొని కూడా తాగవచ్చు.

వంటల్లో కూడా వాము కాస్త వేసుకోవచ్చు. చలికాలంలో ఇలా చేస్తే కూడా మంచిదే. జలుబు వచ్చిన సమయాల్లో వామును పొడిగా చేసుకొని ఆవిరి పట్టుకునే సమయంలోనూ వినియోగించవచ్చు.

వాముతో ప్రయోజనాలు

శ్వాసకోశ ఇబ్బందులకు..: జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి శ్వాసకోశ ఇబ్బందుల నుంచి వాము ఉపశమనం కలిగించగలదు. జలుబు, దగ్గుపై ప్రభావవంతంగా పని చేస్తుంది. చలికాలంలో వామును రెగ్యులర్‌గా తీసుకోవడం మేలు. బ్యాక్టిరీయా, ఫంగస్‍లతో వాము సమర్థవంతంగా పోరాడగలదు.

జీర్ణానికి..: వాము తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు జరుగుతుంది. సరిగా అరకగపోవడం, యాసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యానికి వాము తోడ్పడుతుంది.

గుండె కూడా..: గుండె ఆరోగ్యానికి కూడా వాము మంచి చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ కరగడంలోనూ తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వాము ఉపయోగపడుతుంది.

తదుపరి వ్యాసం