తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Butter Masala: చికెన్ బటర్ మసాలా రెసిపీ, చపాతీ రోటీల్లోకి అదిరిపోతుంది

Chicken Butter Masala: చికెన్ బటర్ మసాలా రెసిపీ, చపాతీ రోటీల్లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

27 June 2024, 17:30 IST

google News
    • Chicken Butter Masala: పనీర్ బటర్ మసాలలాగే చికెన్ బటర్ మసాలాను టేస్టీగా వండుకోవచ్చు. దీన్ని చూస్తేనే నోరూరి పోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ బటర్ మసాలా
చికెన్ బటర్ మసాలా

చికెన్ బటర్ మసాలా

Chicken Butter Masala: పనీర్ బటర్ మసాలా కర్రీ ఎంతో మందికి ఇష్టం. అలాగే చికెన్ బటర్ మసాలాను వండుకోవచ్చు. హోటల్ స్టైల్ లో చికెన్ బెటర్ మసాలా కర్రీ వండితే రుచి అదిరిపోతుంది. కాపోతే ఇది వండానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. బగారా రైస్ తో ఈ చికెన్ బటర్ మసాలా తింటే రుచిగా ఉంటుంది. అలాగే రోటీ, చపాతీల్లోకి చికెన్ బటర్ మసాలా అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

చికెన్ బటర్ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

బోన్ లెస్ చికెన్ - అరకిలో

పసుపు - పావు స్పూను

కారం - ఒకటిన్నర స్పూను

గరం మసాలా - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మరసం - ఒక స్పూన్

పెరుగు - అరకప్పు

నూనె - తగినంత

కసూరి మేధి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నీరు - తగినంత

నూనె - రెండు స్పూన్లు

నెయ్యి లేదా బటర్ - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - మూడు

పచ్చి మిర్చి - ఒకటి

అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - అర స్పూను

జీడిపప్పులు - పది

చికెన్ బటర్ మసాలా రెసిపీ

1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, పెరుగు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి బాగా మ్యారినేట్ చేసి రాత్రిపూట ఫ్రిజ్లో పెట్టేయాలి.

3. దీన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణ ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది.

4. ఉదయం లేచాక దీన్ని కూరగా వండుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.

6. అలాగే అల్లం తరుగును కూడా వేసి వేయించాలి.

7. ఇది బాగా వేగాక వెల్లుల్లి తరుగును కూడా వేసి వేయించుకోవాలి.

8. ఇప్పుడు టమోటాలను ప్యూరీ లాగా చేసి అందులో వేసి బాగా వేయించుకోవాలి.

9. ఇవి బాగా వేగుతున్నప్పుడు కారం వేసి కలుపుకోవాలి.

10. ఆ తర్వాత గుప్పెడు జీడిపప్పులు కూడా వేసి బాగా వేయించాలి.

11. ఇవన్నీ ఇగురులాగా అవుతాయి. టమోటాలు మెత్తబడి ఈ మొత్తం మిశ్రమం ఇగురు లాగా అయ్యేవరకు ఉంచాలి.

12. టమోటాలు ఇగురులాగా అయ్యాక గరం మసాలా, జీలకర్ర పొడి ధనియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

13. మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అది బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

14. అవసరమైతే నీరు పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

15. ఆ నెయ్యిలో పచ్చిమిర్చి తరుగు, పావు స్పూన్ కారం వేసి కలుపుకోవాలి.

16. ఇందులోనే ముందుగా మిక్సీలో ప్యూరీలా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

17. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్నమంట మీద ఉడికించుకోవాలి. ఒక పావుగంట సేపు ఇలా ఉడికించుకోవాలి.

18. మరో పక్క స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

19. ఆ నూనెలో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను తీసి చిన్న మంట మీద వేయించుకోవాలి.

20. అవి గోధుమ రంగులోకి మారినప్పుడు ఇటూ అటూ తిప్పుతూ ఉండాలి. ఇలా చికెన్ ముక్కలను బాగా వేయించుకోవాలి.

21. అవి బాగా వేగాక పక్కన ఉడుకుతున్న గ్రేవీలో వేసేయాలి. ఆ తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.

22. పైన కసూరమేథి చల్లుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. అంతే టేస్టీ చికెన్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఇది ఘుమఘఉమలాడిపోతూ ఉంటుంది. రోటీ చికెన్, చపాతీతో తింటే టేస్టీగా ఉంటుంది. బగారా రైస్, బిర్యానీలతో కూడా అదిరిపోతుంది.

పనీర్ బటర్ మసాలాతో పోలిస్తే చికెన్ బటర్ మసాలా చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో చికెన్ బోన్ లెస్ తీసుకోవచ్చు, లేదా ఎముకతో ఉన్నదైనా తీసుకోవచ్చు. అది మీ ఇష్టప్రకారం ఉంటుంది. మ్యారినేట్ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. కొంతమంది రాత్రంతా మ్యారినేట్ చేస్తారు. మరికొందరు వండటానికి ఒక రెండు గంటలు ముందు మ్యారినేట్ చేసి వండేస్తారు. ఎలా వండుకోవాలో మీ ఇష్టం.

తదుపరి వ్యాసం