తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Bun: పిల్లల కోసం చికెన్ బన్ ఇలా ఇంట్లోనే చేసేయండి, ఓవెన్ అవసరం లేకుండానే వీటిని వండేయచ్చు

Chicken Bun: పిల్లల కోసం చికెన్ బన్ ఇలా ఇంట్లోనే చేసేయండి, ఓవెన్ అవసరం లేకుండానే వీటిని వండేయచ్చు

Haritha Chappa HT Telugu

11 September 2024, 11:30 IST

google News
    • Chicken Bun: ఎప్పుడూ ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్‌లు, స్నాక్స్ కాకుండా ఒకసారి పిల్లలకు చికెన్ బన్ పెట్టి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తినాలన్న కోరిక పెంచుతుంది.
చికెన్ బన్ రెసిపీ
చికెన్ బన్ రెసిపీ ( Hafsa's Kitchen)

చికెన్ బన్ రెసిపీ

Chicken Bun: పిల్లలు బన్స్ బాగా ఇష్టపడతారు. మేము ఇక్కడ చికెన్ బన్ రెసిపీ ఇచ్చాము. ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే కుక్కర్ సాయంతో దీన్ని వండవచ్చు. కుక్కరే కాదు లోతైన కళాయిలో కూడా ఈ చికెన్ బన్‌‌ను రెడీ చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

చికెన్ బన్ రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - రెండు కప్పులు

ఉప్పు - రుచికి సరిపడా

చక్కెర - రెండు స్పూన్లు

బటర్ - రెండు స్పూన్లు

పాలు - పావు కప్పు

చికెన్ కీమా - పావు కిలో

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - ఒకటి

కారం - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

వెల్లుల్లి తరుగు - అర స్పూను

సోయా సాస్ - ఒక స్పూను

టమోటా కెచప్ - రెండు స్పూన్లు

ఈస్ట్ పొడి - ఒక స్పూను

చికెన్ బన్ రెసిపి

1. ఒక గిన్నెలో పాలను పోయండి. అందులోనే చక్కెర, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.

2. బయట మార్కెట్లో ఈస్ట్ అనే పౌడర్ దొరుకుతుంది. వీలైతే దాన్ని కూడా కొన్ని ఒక స్పూన్ వేసి కలపండి. దొరకకపోతే వదిలేయండి.

3. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల గోధుమపిండి, ఒక స్పూను వెన్న వేసి చేతితోనే బాగా కలపండి.

4. ఈ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్నా పాల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి.

5. ఒక పావు గంటసేపు పిండిని పక్కన పెట్టేయండి.

6. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ నూనె వేసి ఈ చపాతీ పిండిని వేసి బాగా కలిపి ఆ గిన్నెపై మూత పెట్టి ఉంచండి.

7. రెండు గంటల పాటు అలా వదిలేయండి.

8. ఇప్పుడు చికెన్ స్టఫింగ్ ను రెడీ చేసుకోవాలి.

9. ఒక గిన్నెలో చికెన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, కారం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి పొడి, సోయాసాస్, వెనిగర్, టమోటా కెచప్ వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు వదిలేయండి.

10. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి.

11. ఆ నూనెలో ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ను వేసి చిన్న మంట మీద ఉడికించుకోండి.

12. ఈ మొత్తం దగ్గరగా బాగా ఉడికే దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. చికెన్ స్టఫ్ రెడీ అయినట్టే.

13. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని పెద్దపెద్ద ఉండల్లా చేసి తీసుకోండి.

14. మీకు బన్ ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో తీసుకోండి.

15. వాటిని చేత్తోనే కాస్త పూరీలా ఒత్తి మధ్యలో చికెన్ కీమా పెట్టండి.

16. దాన్ని రౌండ్ గా లడ్డులా చుట్టేయండి. ఇలా అన్నింటినీ చుట్టుకున్నాక పక్కన పెట్టుకోండి.

17. స్టవ్ మీద ఒక లోతైన కుక్కర్ లేదా కళాయిని పెట్టి స్టాండ్ పెట్టండి.

18. ఆ స్టాండ్ మీద ఒక కంచాన్ని పెట్టి చేత్తో తయారు చేసుకున్న బన్స్ ఒక దానిపై ఒకటి ఉంచండి.

19. పైన మూత పెట్టేసి మొదటి రెండు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉంచి తర్వాత అతి చిన్న మంట మీద 45 నిమిషాల పాటు వదిలేయండి.

20. అంతే బన్స్ బాగా ఉబ్బి చికెన్ బన్స్ రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

21. వీటిని మధ్యలోకి కట్ చేస్తే లోపల చికెన్ స్టఫ్ బయటకు వస్తుంది. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

ఓవెన్ ఉన్నవారు వీటిని ఓవెన్ లోనే చేసుకోవచ్చు. 180 డిగ్రీలకు ముందే ఓవెన్ ప్రీ హీట్ చేసి ఈ బన్స్ పెట్టిన ట్రైన్ లోపల పెట్టి 35 నిమిషాల పాటు వదిలేయాలి. బన్స్ కలర్ మారేవరకు కాల్చుకోవాలి. పైన వెన్నా లేదా నెయ్యితో టచ్ అప్ చేయాలి. అంతే టెస్టీ చికెన్ బన్స్ రెడీ అయిపోతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది.

తదుపరి వ్యాసం