తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fish Fry: చందువా చేపను ఇలా ఫ్రై చేశారంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది

Fish Fry: చందువా చేపను ఇలా ఫ్రై చేశారంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

16 June 2024, 17:30 IST

google News
    • Fish Fry: చందువా చేపలు చూడటానికి ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి ఖరీదైన చేపల్లో ఇవీ ఒకటి. బల్లపరుపుగా ఉండే ఈ చేపలను వేపుడు చేసుకుంటే ఎంతో రుచి.
చందువా ఫిష్ ఫ్రై రెసిపీ
చందువా ఫిష్ ఫ్రై రెసిపీ

చందువా ఫిష్ ఫ్రై రెసిపీ

Fish Fry: చందువా చేపలు కాస్త ఖరీదైనవి. కానీ రుచి మాత్రం అదిరిపోతాయి. బల్లపరుపుగా ఉండే ఈ చేపలను ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చేపలను పాంప్రెట్ చేపలు అంటారు. వీటితో టేస్టీగా ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోండి.

చందువా చేప వేపుడుకు కావలసిన పదార్థాలు

చందువా చేప - మూడు

నూనె - మూడు స్పూన్లు

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్

నిమ్మకాయ రసం - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

చందువా చేప వేపుడు రెసిపీ

1. చందువా చేప బల్లపరుపుగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా కడిగి పైన గాట్లు పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ నూనె, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి తరుగు వేసి ముద్దలా కలుపుకోవాలి.

3. దాన్ని ఆ మసాలా మొత్తం చేపకు పట్టేలా రాయాలి.

4. చేప మీద పెట్టిన గాట్ల మధ్యలో కూడా ఈ మసాలాను కూరాలి.

5. 20 నిమిషాల పాటు ఆ చేపను అలా వదిలేయాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పెనం పెట్టి నూనె వేయాలి.

7. ఆ నూనె వేడెక్కాక దాన్ని చిన్న మంట మీద ఉంచి ఈ చేపను వేసి ఫ్రై చేయాలి. రెండు నిమిషాలకు తిరగేస్తూ ఉండాలి.

8. రెండు నిమిషాలు ఒకవైపు, రెండు నిమిషాలు రెండోవైపు బాగా ఫ్రై అవుతుంది.

9. అది బాగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో వేసుకోవాలి.

10. పైన నిమ్మ రసాన్ని జల్లి కొత్తిమీర తరుగును, కరివేపాకులను చల్లుకుంటే టేస్టీ చందువా చేప ఫ్రై రెడీ అయినట్టే.

చేప ఫ్రై చేయాలనుకుంటే చందువానే ఎంచుకోవాలి. ఇవి కాస్త పలచగా, బల్లపరుపుగా ఉంటాయి. సులువుగా ఫ్రై అవుతాయి. టేస్ట్ లో కూడా అదిరిపోతాయి. కాకపోతే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు దీన్ని వదలలేరు.

తదుపరి వ్యాసం