తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti : ఈ తప్పులు చేస్తే కష్టాలు కూడా వృధా, జీవితంలో విజయం సాధించలేరు!

Chanakya Niti : ఈ తప్పులు చేస్తే కష్టాలు కూడా వృధా, జీవితంలో విజయం సాధించలేరు!

HT Telugu Desk HT Telugu

16 July 2022, 21:37 IST

    • Chanakya Niti : జీవితంలో విజయం సాధించాలంటే, చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా వైఫల్యం భయం లేకుండా ధైర్యంతో ముందుకు వచ్చినప్పుడే విజయం సాధించగలం
Chanakya Niti
Chanakya Niti

Chanakya Niti

Chanakya Niti :ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు ఆపారమైన తప్పిదాలు విజయానికి అడ్డుగా మారుతాయి. కొన్ని ఈ పొరపాట్లు మొత్తం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని చాణక్య నీతి వివరిస్తోంది. అటువంటి సందర్భాలలో ఈ లోపాలను వెంటనే గుర్తించి సరిచేయాలి. సరైన సమయంలో చాణక్య నీతిలో పేర్కొన్న విధంగా వ్వవహరిస్తే మీ విజయానికి ఎటువంటి ఆటంకం ఉండదు.

ఈ తప్పులు విజయానికి అడ్డంకులుగా మారతాయి -

ఎవరినీ అనుకరించవద్దు -(Fear of failure) –

ఇతరులను చూస్తూ ఏ పనీ చేయకండి. మీకు ఏ ఉద్యోగం సరైనదో, ఫలితాలు ఎలా ఉండవచ్చో నిర్ణయించుకోవడానికి ఎల్లప్పుడూ మీ సామర్థ్యంపై దృష్టి పెట్టండి. చేస్తున్న పనిలో విజయం సాధించగలనా లేదా అని నిర్ణయించండి. మీరు ఖచ్చితమైన ప్రణాళికతో పనిని ప్రారంభించండి. సరైన ప్రణాళిక. ఆలోచన లేకుండా చేసే పని వైఫల్యానికి దారి తీస్తుంది.

భయం వద్దు (Leaving work incomplete)

మీరు పని చేయడం ప్రారంభించినప్పుడు ఎప్పుడూ వైఫల్యం సంబంథించిన ఆలోచన మీ మనస్సులోకి ప్రవేశించనివ్వవద్దు. మనస్సులో అపజయానికి సంబంధించిన ఆలోచనలు ఉన్న వ్యక్తికి విజయం దగ్గరవడం చాలా కష్టం. ఓటమి భయం ఉన్న ప్రతి పనిని అర్ధంతరంగా వదిలేస్తారు .ఇలాంటి పరిస్థితులలో వైఫల్యాలు ఎదురవుతూనే ఉంటాయి.

పనిని అసంపూర్తిగా వదిలేయవద్దు (Leaving work incomplete)

ఒక పనిని ప్రారంభించిన తర్వాత, దానిని అసంపూర్తిగా వదిలేయవద్దు. ఒక్కోసారి కష్టపడి సగం వరకు చేరుకుని విజయం చూడకుండానే మనసు మార్చుకుంటారు. ఇలా చేయవద్దు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకు సాగాలి. లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు.

మీ ప్రణాళికను ఇతరులతో పంచుకోవద్దు - (Do not share your plan with others)

కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. మీరు విజయం సాధించే వరకు మీ ఆలోచనను ఎవరికీ చెప్పకండి. లేకపోతే మీ ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు సృష్టిస్తారు.

తదుపరి వ్యాసం