తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broccoli Dosa: బ్రోకలీ పాలకూర దోశ, డయాబెటిస్ వారికి మేలు చేసే పోషకాల బ్రేక్ ఫాస్ట్ ఇది

Broccoli Dosa: బ్రోకలీ పాలకూర దోశ, డయాబెటిస్ వారికి మేలు చేసే పోషకాల బ్రేక్ ఫాస్ట్ ఇది

Haritha Chappa HT Telugu

11 December 2024, 17:42 IST

google News
    • Broccoli Dosa: బ్రోకలీతో చేసే ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ దోశ చాలా మేలు చేస్తుంది. ఇందులో మనం పాలకూరను కూడా వాడాము.
బ్రోకలీ పాలకూర రెసిపీ
బ్రోకలీ పాలకూర రెసిపీ

బ్రోకలీ పాలకూర రెసిపీ

బ్రోకలీ, పాలకూర... ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేసే బ్రోకలీ పాలకూర దోశె రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని చాలా సులువుగా చేసేయచ్చు. పైగా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

బ్రోకలీ పాలకూర దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బ్రోకలీ ముక్కలు - ఒక కప్పు

పాలకూర తరుగు - ఒక కప్పు

వెల్లుల్లి రెబ్బలు - అయిదు

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - పావు స్పూను

నల్ల మిరియాల పొడి - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

శెనగ పిండి - ఒక కప్పు

పచ్చిమిర్చి - రెండు

బ్రోకలీ పాలకూర దోశ రెసిపీ

1. బ్రోకలీని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి.

2. పాలకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. మిక్సీలో బ్రోకలీ, పాలకూరను, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు స్పూన్లు నీళ్లు వేయాలి.

4. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి.

5. ఈ మొత్తం రుబ్బుని ఒక గిన్నెలో వేయాలి.

6. ఆ రుబ్బులోనే శెనగపిండి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

7. దోశెల పిండిలా జారుడుగా వచ్చేలా నీరు పోసుకోవాలి.

8. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి దోశెల్లా పోసుకోవాలి.

9. దీన్ని ఏ చట్నీతో తిన్నా రుచిగానే ఉంటుంది. కొబ్బరిచట్నీతో ప్రయత్నిస్తే మీకు నచ్చుతుంది.

బ్రోకలీ, పాలకూర అందరి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రోకలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఒక నారింజ పండులో ఎంత విటమిన్ సి ఉంటుందో... బ్రోకలీలో కూడా అంతే ఉంటుంది. విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. బ్రోకలీలో ఇనుము, కాల్షియం, జింక్, పొటాషియం, థయామిన్, ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటివి అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు బ్రోకలీ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఊబకాయం బారిన పడిన వారు కూడా బ్రోకలీని ఆహారంలో భాగం చేసుకోవాలి.

పాలకూరలో కూడా రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. శ్వాససంబంధిత రోగాలను దూరం చేసే శక్తి పాలకూరకు ఉంది. స్త్రీలు పాలకూరను తింటే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది.

తదుపరి వ్యాసం