తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broccoli Rice: బ్రకోలీ రైస్... పిల్లలకు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Broccoli Rice: బ్రకోలీ రైస్... పిల్లలకు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Haritha Chappa HT Telugu

14 March 2024, 11:20 IST

google News
    • Broccoli Rice: పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటి వారికి బెస్ట్ ఎంపిక బ్రకోలి రైస్. ఇది అన్ని విధాలుగా పిల్లలకు మేలే చేస్తుంది.
బ్రకోలీ రైస్ రెసిపీ
బ్రకోలీ రైస్ రెసిపీ

బ్రకోలీ రైస్ రెసిపీ

Broccoli Rice: స్కూలుకు వెళ్లే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలి. అలాగే అవి రుచిగాను ఉండాలి. వారి రోగనిరోధక శక్తిని పెంచే బ్రొకోలీ రైస్‌ను తినిపించి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది. బ్రకోలీలో ఉండే ఎన్నో పోషకాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక్కసారి ఈ బ్రకోలీ రైస్ పెడితే పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు. దీని రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉండే బ్రోకోలిని పిల్లలు తినలేరు, కాబట్టి ఇలా బ్రకోలి రైస్ రూపంలో వారిచేత తినిపించండి.

బ్రకోలి రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రకోలి ముక్కలు - ఒక కప్పు

వండిన అన్నం - రెండు కప్పులు

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను

గరం మసాలా - పావు స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - సరిపడినంత

పసుపు - పావు స్పూను

బ్రోకోలి రైస్ రెసిపీ

1. అన్నాన్ని వండుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా ఉంటుంది.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. నూనెలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి.

4. అందులోనే బ్రొకోలీ ముక్కలను వేసి వేయించాలి.

5. గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

6. పైన మూత పెడితే మంట చిన్నగా పెట్టాలి.

7. ఇలా చేయడం వల్ల బ్రకోలీ పచ్చిదనం లేకుండా ఉడుకుతుంది.

8. తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి.

9. తరువాత స్టవ్ కట్టేయాలి. పైన కాస్త కొత్తిమీరను తరుగును చల్లుకోవాలి.

10. అంతే బ్రోకోలి రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది.

బ్రోకలీ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారిలోని చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం రాకుండా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడడం వంటివి గుండె జబ్బులను పెంచుతాయి. తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు రాకుండా అడ్డుకునే శక్తి బ్రొకోలికి ఉంది. ఎందుకంటే బ్రోకలీలో పొటాషియం అధికంగా ఉంటుంది.

బ్రొకోలీ రైస్‌ను వారానికి కనీసం ఒకసారైనా పిల్లలు చేత తినిపించండి. ఇది వారికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీనిలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. డయాబెటిస్‌తో బాధపడేవారు కచ్చితంగా బ్రోకోలిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. అలాగే జీర్ణ క్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. బరువు తగ్గడానికి బ్రకోలీ సహాయపడుతుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఏవీ రాకుండా బ్రకోలి అడ్డుపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం