తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Feeding Week : పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలంటే.. ఫిట్​గా ఉండాల్సిందే..

Breast Feeding Week : పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలంటే.. ఫిట్​గా ఉండాల్సిందే..

05 August 2022, 14:51 IST

google News
    • Breast Feeding Week : మీరు తల్లిపాలు ఇస్తున్నారా? అయితే మీరు వ్యాయామాలకు భయపడకుండా ఫిట్​గా ఉండాలి అంటున్నారు నిపుణులు. మీ ఆందోళనలను పక్కన పెట్టి.. నిపుణులు సిఫార్సు చేసిన.. కొన్ని చిట్కాలను పాటిస్తే.. మీరు ఫిట్​గా ఉంటారు అంటున్నారు. 
తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాల వారోత్సవాలు

Breast Feeding Week : తల్లిగా ఉండటం స్త్రీకి పరివర్తనలో ముఖ్యమైన దశ. అదే సమయంలో ఇది మీ జీవనశైలిని సర్దుబాటు చేస్తుంది. కొన్నిసార్లు ఫిట్‌నెస్ మీద శ్రద్ధ లేకుండా చేస్తుంది. ఒక తల్లిగా తన బిడ్డకు ఉత్తమమైనదాన్ని ఇవ్వాలనే కోరుకుంటుంది. అయితే పాలు ఇచ్చే విషయంలో కూడా వారు ఆందోళన చెందుతారు. నేను డెలివరీ తర్వాత వెంటనే నాకు తగినంత పాలు లభిస్తాయా? నా బిడ్డ నా పాలతో సంతృప్తి చెందిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి నేను ఎక్కువ తినాలా? తల్లి పాలివ్వడంలో నేను వ్యాయామం చేయగలనా? వ్యాయామం నా పాల సరఫరాపై ప్రభావం చూపుతుందా? వంటి ప్రశ్నలు ఆమె మదిలో మొదులుతూనే ఉంటాయి. అయితే తల్లిపాలు ఇచ్చే సమయంలో వ్యాయామం చేయాలి అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

మానవ పాల ఉత్పత్తి రెండు హార్మోన్ల ఫలితం. ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. ఈ రెండు హార్మోన్లు పాలు ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. వ్యాయామం ప్రారంభమైన వెంటనే పిట్యూటరీ గ్రంథి నుంచి ఈ రెండు హార్మోన్లు ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. శిశువు తల్లి పాలు తాగుతున్నప్పుడు మెదడుకు ఇంద్రియ ప్రేరణలను ప్రేరేపిస్తుంది. ప్రతిస్పందనగా పిట్యూటరీ గ్రంధి ముందు భాగం ప్రోలాక్టిన్‌ను, వెనుక భాగం ఆక్సిటోసిన్‌ను స్రవిస్తుంది.

ఆ సమయంలో ఎక్కువ ప్రొలాక్టిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి రాత్రిపూట ఆహారం తీసుకోవడం తల్లికి పాలు సరఫరాను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇది తల్లికి రిలాక్స్‌గా నిద్రపోయేలా చేస్తుంది. రాత్రికి తల్లిపాలు ఇచ్చినా కూడా ఆమె బాగా విశ్రాంతి తీసుకుంటుందని అంటున్నారు వైద్యులు.

తక్కువ ప్రభావ వ్యాయామాలతో

మీ ఫిజికల్ థెరపిస్ట్‌తో డయాస్టాసిస్ రెక్టీని మీరే అంచనా వేయండి. క్రమంగా కోర్ బలోపేతం చేయడం ప్రారంభించండి. నడక ఒక అద్భుతమైన వ్యాయామం. మీరు సాయంత్రం మీతో పాటు మీ బిడ్డను తీసుకెళ్లవచ్చు. మీ డెలివరీ అయిన 6 వారాల తర్వాత.. మీరు కార్డియో శిక్షణ, సర్క్యూట్ శిక్షణతో వ్యాయామాన్ని ప్రారంభించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..

మీరు బలహీనంగా అనిపించకుండా ఉండటానికి రోజుకు కనీసం 2,400 కిలో కేలరీలు తినండి. ఎందుకంటే తల్లిపాలు కూడా బరువు తగ్గడానికి దారితీస్తుంది. రోజుకు 550 కిలో కేలరీలు బర్న్ చేస్తుంది. మీరు వ్యాయామం చేయడం ప్రారంభించినప్పుడు.. బలహీనంగా అనిపించినప్పుడు తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల పాలు సరఫరా తగ్గుతుంది. ప్రసవం తర్వాత మీ ఆహారాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం.

హైడ్రేటెడ్​గా ఉండాలి..

మీ శరీరంలో 80 శాతం నీరు ఉన్నందున ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. వర్కవుట్‌కు ముందు లేదా వెంటనే హైడ్రేట్​గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

సౌకర్యవంతమైన బ్రాను ధరించాలి..

అధిక ఇంపాక్ట్ వ్యాయామాల సమయంలో మంచి మద్దతు పొందడానికి.. స్పోర్ట్స్ బ్రాను ధరించండి.

ఫీడింగ్ సమయం

వ్యాయామం చేసే ముందు మీ బిడ్డకు తినిపించండి. లేదా పాలు పంప్ చేయండి. ఎందుకంటే నిండిన రొమ్ములతో వ్యాయామం చేయడం చాలా కష్టం. అది అసౌకర్యంగా అనిపించవచ్చు.

కొన్నిసార్లు కఠినమైన వ్యాయామాలతో.. రక్తప్రవాహంలో లాక్టిక్ యాసిడ్ చేరడం జరుగుతుంది. దీని వలన తల్లి పాలు రుచికి కొద్దిగా పుల్లగా ఉంటాయి. అప్పుడు మీ బిడ్డ పాలు తాగడానికి నిరాకరిస్తే.. కొంచెం పాలను బయటకు పంపి.. ఆపై బిడ్డకు ఆహారం ఇవ్వండి. వ్యాయామం చేసిన గంట తర్వాత శిశువుకు పాలు ఇవ్వడం మరొక మార్గం.

ధ్యానం

మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి వ్యాయామం తర్వాత ధ్యానం చేయండి. ఇది మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది. మీ పాల ప్రవాహం సులభమయ్యేలా చేస్తుంది.

ఇవన్నీ.. గర్భధారణ సమయంలో పొందిన అదనపు కొవ్వును పోగొట్టడంలో సహాయపడతాయి. వివిధ హృదయ సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. మూడ్ స్వింగ్స్‌తో మేనేజ్ చేయడంలో ఉపయోగపడతాయి. ప్రొలాక్టిన్ స్థాయిలను పెంచడం వల్ల పాల సరఫరా మెరుగుపడుతుంది. తల్లి మరింత శక్తివంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. మీ ఆరోగ్యమే మీ సంపద కాబట్టి వ్యాయామం చేస్తూ ఉండండి.

టాపిక్

తదుపరి వ్యాసం