తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు.. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే..

World Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు.. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే..

04 August 2022, 13:55 IST

google News
    • World Breast Feeding Week : శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధికి తల్లిపాలు చాలా ముఖ్యమైనవి. ఇది తల్లికి ఒక అద్భుతమైన అనుభవం. ఈ ప్రాముఖ్యతను తెలుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్
ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్

ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్

World Breast Feeding Week 2022 : పిల్లలు హెల్తీగా ఉండేందుకు.. తల్లి పాల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. క్రమం తప్పకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సాహిస్తూ.. ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తున్నారు.

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మహిళలు, సమాజ మద్దతు, జీవావరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్, విద్య, మానవ హక్కులతో సహా వార్షిక థీమ్‌లతో WBW 1992లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఒక వారం పాటు దీనిని నిర్వహిస్తున్నారు.

World Breast Feeding Week లక్ష్యం

ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ వేడుకలు బ్రెస్ట్ ఫీడింగ్ కమ్యూనిటీని ఏకం చేయడానికి, తల్లి పాలివ్వడానికి ప్రజల మద్దతును పెంచడానికి ఉపయోగపడతాయి. తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే వీరి లక్ష్యం. WHO అందించిన నివేదిక ప్రకారం.. ముగ్గురు పిల్లలలో ఇద్దరికి తల్లిపాలు లేవు. అందువల్ల ఈ రోజును గుర్తించడం మరింత కీలకమైనది.

పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లులు తమ పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని WHO సిఫార్సు చేస్తుంది. తల్లి పాలలోని ప్రతిరోధకాలు సూక్ష్మక్రిములు, వైరస్‌లకు వ్యతిరేకంగా శిశువు రక్షణకు సహాయపడతాయి.

తల్లిపాలతో పిల్లలకు కలిగే లాభాలు

ఆరు నెలల పాటు తల్లిపాలు తాగిన శిశువుల్లో చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ పరిస్థితులు లేదా అతిసారం వచ్చే అవకాశాలు శూన్యం. తల్లిపాలు తాగే పిల్లలకు ఆస్తమా లేదా అలెర్జీలు వచ్చే ప్రమాదం తక్కువ.

ఈ సంవత్సరం WBW థీమ్

ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ను సూచించడానికి కొత్త థీమ్, నినాదాన్ని రూపొందిస్తున్నారు. ఈ థీమ్ తల్లి పాలివ్వడంలో ఒక నిర్దిష్ట అంశాన్ని నొక్కి చెప్పడం, అవగాహన కల్పిస్తుంది. ఈ సంవత్సరం WBW థీమ్ 'తల్లిపాలు కోసం స్టెప్ అప్: ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్.' ఈ అంశంతో తల్లిపాలను గురించి అవగాహనను మరింత పెంచాలని భావిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం