తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Feeding Week : పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులకు కూడా ప్రయోజనాలే..

Breast Feeding Week : పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులకు కూడా ప్రయోజనాలే..

02 August 2022, 16:14 IST

google News
    • WHO ప్రకారం.. తల్లిపాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. తల్లి పాలు తాగని వారికంటే.. తాగేవారు అధిక బరువు, ఊబకాయం, మధుమేహానికి గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నవజాత శిశువులకు గొప్ప భోజనం తల్లి పాలు మాత్రమే. ఎందుకంటే ఇది పిల్లల్లోని అనారోగ్యాలను నివారించడంలో.. ప్రతిరోధకాలను కలిగి ఉంటుంది.
పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు

పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు

World Breast Feeding Week : ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా 1992లో ఈ దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులు తమ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు తల్లిపాలు పట్టేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్ణయిస్తుంది. తల్లిపాలు ఇవ్వడం.. తల్లులు వారి నవజాత శిశువులకు అందించే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన పెంచుతున్నారు. తల్లికి, శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి తల్లిపాలు సహజమైన ఉచిత మార్గమని డాక్టర్ నేహా తెలిపారు.

శిశువుకు కలిగే ప్రయోజనాలు

* తల్లి, బిడ్డ మధ్య భావోద్వేగ బంధం మెరుగుపడుతుంది.

* మొదటి సంవత్సరం శిశువుకు అవసరమైన పోషకాహారం సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది.

* తల్లిపాలు ఇమ్యునోగ్లోబులిన్‌లతో నిండి ఉంటుంది. ఇది శిశువునకు మొదటి సంవత్సరంలో అనేక అంటువ్యాధులు, ముఖ్యంగా చెవి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లు, అలాగే అతిసారం, అలెర్జీ పరిస్థితులు, SIDS లేదా 'ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్'కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఇస్తుంది.

* బాల్య ల్యుకేమియా, ఉబ్బసం, అటోపిక్ డెర్మటైటిస్ ప్రమాదాలు తగ్గించడంతో పాటు తల్లిపాలు ఇవ్వడం ఆపివేసిన తర్వాత కూడా ప్రయోజనాలు కొనసాగుతాయి.

* యుక్తవయస్సులో టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తల్లికి కలిగే ప్రయోజనాలు

* తల్లిపాలు ఇచ్చే సమయంలో విడుదలయ్యే హార్మోన్ ఆక్సిటోసిన్, గర్భాశయం సంకోచించడంలో సహాయపడుతుంది. ప్రసవానంతర రక్తస్రావం అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. డెలివరీ తర్వాత వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది.

* తల్లిపాలు సహజ గర్భనిరోధకంగా పని చేస్తాయి. ఎందుకంటే ప్రత్యేకంగా పాలిచ్చే తల్లులకు డెలివరీ తర్వాత 8-10 నెలల వరకు పీరియడ్స్ ఉండవు. ఇది డెలివరీ సమయంలో జరిగిన నష్టం నుంచి శరీరం కోలుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

* పాలిచ్చే తల్లులు ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని తెలిసింది. పాలు ఇవ్వడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని చెప్తున్నారు.

* ఇది గర్భధారణ సమయంలో పెరిగిన బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

* ఇది హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌తో పాటు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం